Liger : విజయ్ దేవరకొండ, అనన్య పాండే నటించిన సినిమా ‘లైగర్’, పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మీద మంచి అంచనాలు ఉన్నాయి. ఇక సినిమా నిన్న విడుదల అయి బాక్స్ ఆఫీస్ వద్ద మిక్సడ్ టాక్ సొంతం చేసుకుంది. విజయ్ ఈ సినిమాతో టాలీవుడ్ లో టైర్ 1 హీరోల జాబితా లో చేరిపోతాడని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు. అయితే సినిమా మీద మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఈ ప్రభావం రాబోయే రోజుల్లో కలెక్షన్స్ పై పడనుంది. పాన్ ఇండియా సినిమా గా విడుదలయిన లైగర్ కి బాలీవుడ్ లో బాయ్ కాట్ సెగ తగిలినా మొదటి రోజు కలెక్షన్స్ మాత్రం బాగానే వచ్చాయి. అడ్వాన్స్ బుకింగ్స్ లో బాగానే చెలరేగిన లైగర్ మొదటి రోజు ఎంతుందంటే…

ఫస్ట్ డే కలెక్షన్స్ ఓకే మరీ నెక్స్ట్…
సినిమా విడుదలకి ముందే అడ్వాన్స్ బుకింగ్స్ నాలుగురోజుల ముందే బాగా జరిగాయి. ఇక థియేటర్స్ లో ఫస్ట్ షో కి 60-70% ఆక్యుపెన్సి తో నిండుగానే కనిపించాయి. ఇక టాలీవుడ్ లో మీడియం రేంజ్ హీరోల్లో రికార్డు స్థాయి ఓపెనింగ్స్ రాబట్టాడు విజయ్. ఓవర్ సీస్ ప్రీమియర్స్ ద్వారా $476K ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ ద్వారా $650K రాబట్టొచ్చని అంచనా. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న సినిమాకు మొదటి రోజు కలెక్షన్స్ మాత్రం అదిరిపోయాయి తెలుగు రాష్ట్రాల్లో డే 1 కలెక్షన్స్ ఎలా ఉన్నాయంటే…
Uttharandhra – 1.27 కోట్లు
Krishna – 49 లక్షలు
Guntur – 83 లక్షలు
East – 64 లక్షలు
West – 38 లక్షలు
Nellore – 40 లక్షలు

ఇక సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు అటు ఇటుగా 30- 35 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను వసూలు చేసిందని అంచనా. ఇక ఆంధ్ర, తెలంగాణ లో 15 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని అంచనా. రెస్ట్ ఆఫ్ ఇండియా లో 7.7 కోట్లు వసూలు చేసింది. ఫైనల్ లెక్కలను బట్టి ఈ అంకెలు కొంచెం మారవచ్చు. ఓవర్ ఆల్ గా సినిమాకు మిక్స్డ్ టాక్ ఉన్నా పూరీ, విజయ్ మ్యాజిక్ తో మొదటి రోజు మాత్రం మంచి వసూళ్లు వచ్చేసాయి.



































