Vish : ‘మెహబూబ’ సినిమాలో విలన్ గా విష్ణు రెడ్డి నటించారు. నిజానికి విష్ణు రెడ్డి 2009 లో మిస్టర్ సౌత్ పేజెంట్ విన్నర్. ఇక సినిమాల మీద ఇంట్రస్ట్ తో నాగచైతన్య మొదటి సినిమా జోష్ లో నటించాడు. సినిమా తరువాత అసిస్టెంట్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గాను ఇంకా ఇతర విభాగాలలో పనిచేసి ఇండస్ట్రీ గురించి అవగాహన తెచ్చుకోవాలని అనుకున్నాడు. ఇక లవ్ బ్రేక్ అప్ వల్ల మార్షల్ ఆర్ట్స్ వైపు వెళ్లి వాటిలో శిక్షణ తీసుకుని, బ్యాంకాక్ వెళ్లి ఆరు నెలలు శిక్షణ తీసుకున్న విష్, ఇప్పుడు తాజాగా లైగర్ సినిమా అవకాశంతో విజయ్ కి ధీటుగా నెగెటివ్ పాత్రలో కనిపించనున్నాడు.

రెండు ఎద్దులు కొట్టుకున్నట్లుగా ఉంటుంది…
ఇక లైగర్ సినిమా బాక్సింగ్ నేపథ్యంలో సాగే సినిమా, యాక్షన్ సన్నివేశాలకు కొదవ ఉండదు. సినిమాలో విజయ్ దేవరకొండకు, విష్ కి మధ్య యాక్షన్ సన్నివేశాలు చాలా ఉన్నాయి. ఇక వాటి గురించి విష్ణు మాట్లాడుతూ రెండు ఎద్దులు కొట్టుకుంటున్నట్లు అనిపిస్తుంది స్క్రీన్ మీద చుసినపుడు, ప్రేక్షకులకు నచ్చుతుంది అంటూ చెప్పాడు.
మైక్ టైసన్ ను పట్టుకోడానికి ఛార్మి కష్ట పడింది…

ఇక సినిమాలో కీలక పాత్రలో మైక్ టైసన్ నటిస్తున్నారు. ఆ పాత్రలో ఒక లెజెండరీ వ్యక్తి ఉండాలని అది మైక్ టైసన్ అయితేనే బాగుంటుందని ఆయన్ని పట్టుకోడానికి ఛార్మి చాలా కష్టపడింది. రెండేళ్లు కష్టపడింది. లండన్, అమెరికా అంటూ చాలా చోట్ల ఆయనను కలవడానికి వెళ్ళింది. ఇక ఈ మెయిల్స్ చేస్తూనే ఉండేవారు ఆయన కాంటాక్ట్ కోసం అలా చివరికి పట్టుకుంది. కరోనా పాండమిక్, లాక్ డౌన్ ఉండటం వల్ల ఆయన సినిమాలో నటించారు. ఒకరకంగా కరోనా పాండమిక్ సినిమాకు కలిసివచ్చింది. ఇక ఆయన చాలా కూల్ గా ఒక 10 ఏళ్ల బాబు లాగా ఉంటారు. ఎలా ఉంటారో ఆయన వర్క్ చేసేటపుడు అని కంగారు పడ్డాము కానీ ఆయన చాలా డౌన్ టూ ఎర్త్. నేను ఇంతవరకూ చూసిన, సక్సెస్ ఐన వాళ్ళు ఎవరు సక్సెస్ గురించి క్లాస్ పీకరు, లెక్చర్ ఇవ్వరు, చాలా కూల్ గా తమ పని తాము చేసుకుపోతారు, మైక్ టైసన్ కూడా అంతే అంటూ లైగర్ సినిమా విశేషాలను విష్ చెప్పాడు.
































