దేశవ్యాప్తంగా మద్యం హోమ్ డెలివరీ కాబోతుంది. ఒకటి రెండు రోజుల్లో డెలివరీ చేసేందుకు కొన్ని సంస్థలకు ఆదేశాలు ఇవ్వబోతోంది ప్రభుత్వం. కానీ ఇది మన దేశంలో కాదులెండి దుబాయ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇది. కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ కారణంగా చాలా దేశాలలో ప్రభుత్వ ఆదాయం పూర్తిగా దెబ్బతింది. సరిగ్గా దుబాయ్ లో కూడా ఇదే పరిస్థితి. దానితో దుబాయ్ ప్రభుతం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమంగా జరుగుతున్నా మధ్య సరఫరాను అడ్డుకోవంతో పాటు లాక్ డౌన్ కారణంగా దెబ్బతిన్న ప్రభుత్వ ఆదాయాన్ని పూడ్చుకోవడానికి మద్యాన్ని హోం డెలివరీ చేయాలనీ నిర్ణయించింది.

ఇందుకోసం ప్రభుత్వానికి చెందిన మారిటైం అండ్ మార్కంటైల్ ఇంటెర్నేషనల్ (ఎంఎంఐ) మరియు ఆఫ్రికన్ ఈస్టర్ సంస్థలు కలిసి ఈ మద్యం సరఫాను చేయనున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రెండు సంస్థలు కలిసి https://www.legalhomedelivery.com అనే వెబ్సైటు ను సైతం రూపొందించాయి.

courtesy @legalhomedelivery.com

అయితే దీనిపై కొన్ని కండిషన్స్ కూడా పెట్టింది దుబాయ్ ప్రభుత్వం. దుబాయ్ లో ఉన్న పర్యాటకులు తమ పాస్ పోర్టును ఆధారంగా చూపించి మద్యం కొనుగోలు చేయొచ్చు. కానీ స్థానికులకు మద్యం సరఫరా చేయాలి అంటే మాత్రం పోలీసులనుంచి ఆల్కహాల్ లైసెన్స్ కంపల్సరీ. 21 సంవత్సరాలు నిండిన ముస్లిమేతరులు మాత్రమే ఈ లైసెన్స్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపారు. మరోపక్క కరోనా వైరస్ ను కట్టడి చేయడం కోసం దుబాయ్ మొత్తం లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే బార్లు, హోటళ్లు మొత్తం మూసివేశారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here