ప్రస్తుతం ప్రపంచం ఎలక్ట్రానిక్ మాయం అయిపోతుంది. చేతిలో మొబైల్ ఫోన్ దానికి ఓక ఇంటర్నెట్ ఉంటె చాలు.. ఎక్కడనుంచి అయినా.. ఎప్పుడైనా షాపింగ్ చేసే ఉండటంతో యువత ఆన్లైన్ షాపింగ్ పైనే ఎక్కువగా మొగ్గుచూపుతోంది. బట్టలు, షూస్, నిత్యావసర వస్తువులు, ఎలెక్ట్రానిక్ వస్తువులు ఆఖరికి మన తినే ఫుడ్ కూడా ఆన్లైన్ లో ఆర్డర్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పటికే కుప్పలు తెప్పలుగా ఈ కామర్స్ వెబ్సైట్లు వెలిసాయి. ప్రపంచం మొత్తం ఆన్లైన్ చుట్టూ తిరుగుతుంటే మద్యం ఆన్లైన్ లో అమ్మితే తప్పేముంది అనుకుంటున్నారో ఏమో. తాజాగా లిక్కర్ ఇండస్ట్రీ ఈ కొత్త విధానాన్ని అమలులోకి అమలు చేసే యోచనలో ఉన్నాయి. ఇక మీకు కావాల్సిన బీర్లు, విస్కీ, బ్రాందీ, వైన్… మొదలగునవి అన్ని ఆన్లైన్ లో దొరికే అవకాశం ఉంది. ప్రభుత్వాలకు అధిక ఆదాయాన్నిచ్చే లిక్కర్ మార్కెట్ ను కొత్త పుంతలు తొక్కించే దిశగా ఆలోచనలు జరుగుతున్నాయి.

అమెజాన్, ఫ్లిప్ కార్ట్ మొదలగు ఈ-కామర్స్ వెబ్సైట్లలో ఆల్కహాల్ ని అమ్మితే ప్రభుత్వాలకు రెట్టింపు ఆదాయాలను తెచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా అభివృద్ధిలో ముందున్న రాష్ట్రాలు ఈ ఆన్లైన్ విధానాన్ని అమలులోకి తీసుకురావాలని ఇంటర్నేషనల్ స్పిరిట్స్ అండ్ వైన్ అసోసియేషన్ అఫ్ ఇండియా (ISWAI) ఎక్సిక్యూటివ్ చైర్మన్ అమృత్ కిరణ్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కర్ణాటకలో ఈ ఆన్లైన్ మద్యం విధానాన్ని అమలులోకి తెచ్చింది. అయితే కర్ణాటక ప్రభుతం రిటైలర్ల సమయాలను పరిష్కరించడంలో విఫలమైందని తెలిపారు, జీఎస్టీ ని మినహాయిస్తే చాలు రాష్ట్రాలకు ఇదే ప్రధాన ఆదయ వనరు అవుతుందని చెప్పారు అమృత్ కిరణ్ సింగ్. ఈ రిటైలింగ్ వల్ల ప్రతి రంగంలోనూ పెరుగుదల కనిపిస్తుందని, దీనిని లిక్కర్ పరిశ్రమకు కూడా వర్తిపింపచేస్తే రాష్టాల ఆదాయం గణనీయంగా పెరిగే అవకాశం ఉందని చెప్పారు. కొన్ని రాష్ట్రాలు అనుకున్న టైం కంటే ముందుగానే ఆన్లైన్ ద్వారా విక్రయించే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు కిరణ్. అయితే ఢిల్లీలో మద్యం కొనుగోలు చేయాలంటే 25ఏళ్ల వయస్సు ఉండాలనే నిబంధన ఉందని, దానిని 21కి తగ్గిస్తే సరిపోతుందని అభిప్రాయపడ్డారు. ఓటు వేయడానికి, పెళ్లి చేసుకోవడానికి 18ఏళ్ల వయస్సు చాలన్నప్పుడు మద్యం కొనడానికి మాత్రం ఎందుకు అని ప్రశ్నించారు.

ఈ ఆన్లైన్ విక్రయాల ద్వారా లిక్కర్ అమ్మకాలు బాగా పెరుగుతాయని ట్రేడ్ వర్గాల అంచనా. తమకు నచ్చిన బ్రాండ్ లను, నచ్చినట్టుగా ఇంటి వద్ద నుంచి ఆన్లైన్ షాపింగ్ చేసే డెలివరీ తెప్పించుకునే అవకాశాన్ని పొందవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here