ఏప్రిల్ 13 సోమవారం నుంచి రెండు రాష్ట్రాల్లో మద్యం షాపులు తెరుచుకోనున్నాయి. అయితే అవి తెలుగు రాష్ట్రాలు కాదులెండి. మేఘాలయా, అస్సాం రాష్ట్రాలలో షాప్స్ ఓపెన్ చేయాలనీ ఆయా రాష్ట్రాల ఎక్సైజ్ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మేఘాలయాలో ఉదయం 9 గంటలనుండి సాయంత్రం 4 గంటల వరకు. అస్సాంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు మద్యం షాపులు ఓపెన్ చేయనున్నారు. మేఘాలయాలో ఈ శుక్రవారం వరకు లిక్కర్ దుఖాణాలు తెరిచి ఉంచనున్నారు. అటు అస్సాంలో మాత్రం తదుపరి ఆదేశాలు వచ్చే వరకు వైన్స్ షాపులు తెరిచేందుకు పర్మిషన్లు ఇచ్చారు.

అయితే ఆ రాష్ట్రాలు కొన్ని కండిషన్స్ పెట్టుకున్నాయి. మేఘాలయలో ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు, అస్సాంలో ఉదయం 10 నుండి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే ఓపెన్ చేయాలి. మద్యం దొరికేవారు కొనడానికి వచ్చేవారు ఖచ్చితంగా సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందే. తుమ్ములు, దగ్గులు, జలుబు ఉన్నవారికి మద్యం దుఖాణాలలో విధులను అప్పగించరాదు. మరియు లిక్కర్ బాటిల్స్ ఇచ్చేప్పుడు, డబ్బులు తీసుకెనప్పుడు శానిటైజర్ ఖచ్చితంగా వాడాల్సిందే. బ్రేవరీలు, డిస్టిలరీలు, బాటిలింగ్ ప్లాంట్లలో పని చేసేవారిలో 50 శాతం మందితో మాత్రమే పని చేయించుకోవాలి. అందులో పని చేసేవారికి ఫుడ్ ఆయా కంపెనీలు పెట్టాల్సిందే. లిక్కర్ సరఫరా చేసే వాహనాలకు పాస్ లు ఉండాలి. చివరగా వైన్స్ షాపులు పోలీసులు, జిల్లా అధికారులు ఇచ్చే మార్గనిర్దేశకాలు కచ్చితంగా పాటించాలి. ఈ కండిషన్స్ తో మాత్రమే మద్యం దుఖాణాలు ఓపెన్ చేయడానికి రెండు రాష్ట్రాలు పర్మిషన్లు ఇచ్చారు.




























