ఒక్క రూపాయికే లీటర్ పెట్రోల్ అంటే నమ్మలేకపోతున్నారు కదూ.. నిజమే ప్రస్తుతం పెట్రోల్ రెట్లు సెంచరీ కొడుతున్న సమయంలో ఒక్క రూపాయికి లీటర్ పెట్రోల్ ఇస్తున్నారు ఠాణేలోని డోంబివలీ యువసేన. అసలు విషయానికి వస్తే.. మహారాష్ట్ర సీఎం కుమారుడు, మంత్రి ఆదిత్య ఠాక్రే పుట్టినరోజు జరిగింది. ఈ సందర్బంగా ఆదివారం ఒక్క రూపాయికే లీటర్ పెట్రోల్ కార్యక్రమం చేపట్టింది డోంబివలీ యువసేన.

ఠాణేలోని ఓ పెట్రోల్ బంకులో ఈ అవకాశం కల్పించింది. విషయం తెలుసుకున్న వాహనదారులు ఆ పెట్రోల్ బంకు ముందు బారులు తీరారు. బంకు ముందు కిలోమీటర్ల మేర క్యూలైన్లు కనిపించాయి. అంతేకాకుండా మరోవైపు మహారాష్ట్రలోనే అంబర్‌నాథ్ వింకో నకాలోని ఒక పెట్రోల్‌బంక్‌లో లీటరు పెట్రోల్ రూ.50కే అందించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట మధ్య వచ్చినవారికి ఈ సదుపాయం కల్పించారు.



























