లాక్ డౌన్ విషయంలో చైనా ఇంత పెద్ద కుట్ర చేసిందా…?

0
164

భారత్ లో మార్చి నెల తొలి వారం నుంచి కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. కరోనా విజృంభణతో గతంలో ప్రజలకు ఎప్పుడూ తెలియని లాక్ డౌన్ పరిచయమైంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలు పూర్తిగా ఇళ్లకే పరిమితం కావాలని సూచించాయి. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి భారత్ తో పాటు ఇతర దేశాలు సైతం లాక్ డౌన్ పైనే ఆధారపడ్డాయి. అయితే చైనా లాక్ డౌన్ పేరుతో పెద్ద కుట్రకు తెర లేపిందని తెలుస్తోంది.

చైనా దేశంలోని వుహాన్ నుంచి కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలకు వ్యాప్తి చెందింది. వైరస్ పుట్టుకకు కారణమైన చైనాలో సాధారణ పరిస్థితులు నెలకొని ఉంటే ఇతర దేశాల్లో మాత్రం వైరస్ అడ్డూఅదుపు లేకుండా వ్యాప్తి చెందుతోంది. ప్రపంచ దేశాలకు కరోనా వ్యాప్తి చెందిన తరువాత చైనా కఠినమైన లాక్ డౌన్ తోనే వైరస్ వ్యాప్తిని అడ్డుకున్నట్లు వెల్లడించింది. అయితే చైనా మాటల్లో ఏ మాత్రం నిజం లేదని తెలుస్తోంది.
 
నిజానికి కరోనా అంత ప్రమాదకరమైన వైరస్ కాదు. తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా సాధారణ పరిస్థితులు ఉన్నా వైరస్ బారి నుంచి మనల్ని మనం కాపాడుకోవడం సాధ్యమే. అయితే ప్రపంచ దేశాలపై ఆధిపత్యం కోసం చైనా లాక్ డౌన్ ను తెరపైకి తెచ్చింది. ప్రపంచ దేశాలు లాక్ డౌన్ ను అమలు చేయడం ద్వారా ఆయా దేశాలు ఆర్థికంగా నష్టపోవడానికి చైనా కారణమైంది.
 
అమెరికన్ లాయర్ మైకెల్ సెంగర్ మాట్లాడుతూ సోషల్ మీడియాను వేదికగా చేసుకుని చైనా ఈ తరహా కుట్రకు తెర లేపిందని చెప్పారు. చైనా కావాలనే కఠినమైన నిబంధనలను చైనాలోని వుహాన్ లో మాత్రమే అమలయ్యేలా చేసి ఇతర దేశాలు కూడా ఆ విధానాన్ని అవలంబించేలా చేసిందని అన్నారు. చైనా తప్పుడు సమాచారం వల్లే ప్రపంచ దేశాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here