LV Gangadhara Shastri : అలనాటి తెలుగు హీరోల్లో ట్రెండ్ ఫాలో అవకుండా సెట్ చేసిన వాళ్లలో కృష్ణ ముందుంటారు. కొత్తదనాన్ని సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేసింది ఖచ్చితంగా సూపర్ స్టార్ కృష్ణ గారే. ఆయన కుటుంబ కథా చిత్రాలు తీసినా, కౌ బాయ్ సినిమాలు తీసినా గూఢచారి అంటూ వచ్చిన తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. మల్టీ స్టారర్ సినిమాలను కూడా ఎక్కువగా అది కూడా దాదాపు అందరి హీరోలతో చేశారు కృష్ణ గారు. అలాంటి కృష్ణ గారి విషయంలో సినిమా ఇండస్ట్రీ మొత్తం వ్యతిరేకం అయిన సంఘటన గురించి సీనియర్ జర్నలిస్ట్, అలాగే భగవద్గీత ఫౌండేషన్ ఫౌండర్ ఎల్వి గంగాధర శాస్త్రి గారు మాట్లాడారు.

ఆయన స్థితప్రజ్ఞలు.. నవ్వుతు చెప్పారు…
ఇండస్ట్రీ లో ఒక్కో హీరో నుండి ఎంతో కొంత నేర్చుకున్నానని అనుభవాలలే మనకు మంచి పాఠాలు అంటూ గంగాధర శాస్త్రి గారు చెబుతారు. సినిమా జర్నలిస్ట్ గా పనిచేసే సమయంలో అప్పటి అందరూ హీరోలతోను బాగా పరిచయం ఉండేదని చెప్పిన గంగాధర శాస్త్రి గారు కృష్ణ గారితో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పారు. ఇండస్ట్రీ హైదరాబాద్ కు చెన్నై నుండి వచ్చిన కొత్తలో నటులు స్టూడియోస్ ఉన్నాయ్ కానీ టెక్నీషియన్స్ అలాగే డాన్సర్స్ వంటి వారు ఇంకా చెన్నై లోనే ఉండటం వల్ల ఇక్కడ ప్రతిభ ఉన్న అవకాశాలు లేకుండా మనవాళ్లకు పోతున్నాయని “సినిమా పరిశ్రమ లోని కేవలం నటులే కాకుండా మిగిలిన రంగాలను కూడా హైదరాబాద్ కు తీసుకు వస్తాము” అని కృష్ణ గారు చెప్పగా ఈనాడు పేపర్ లో అది అచ్చు తప్పు పడి “తీసుకువస్తాను” అని పడింది. దాంతో ఒక్కసారిగా ఇండస్ట్రీ అంత షేక్ అయింది.
అందరూ కృష్ణ గారికి యాంటీగా అయిపోయారు. ఆయన ఒక్కడే చేయగలడా నేను అని చెప్పుకుంటున్నాడు ఎలా చేస్తాడో మేము చూస్తాం అంటూ మాట్లాడారు. కానీ కృష్ణ గారు ఈనాడు ఆఫీస్ కు ఫోన్ చేసి చాలా నెమ్మదిగా నవ్వుతు ఏంటి గంగాధర్ మేము అని చెబితే నేను అని అచ్చు తప్పు వేశారు సరి చేయండి అంటూ చాలా హుందాగా చెప్పారు. ఆయన స్థానంలో నేనుంటే ఆ జర్నలిస్ట్ ను కోప్పడేవాడిని కానీ కృష్ణ గారు అలా చేయలేదు. ఆయన స్థితప్రజ్ఞలు అంటూ తెలిపారు. సినిమా అయినా అంతే హిట్ అయినా ఫ్లాప్ అయినా ఒకేలా తీసుకుంటారు అంటూ కృష్ణ గారితో అనుబందాన్ని వివరించారు.































