తెలుగు సినిమాల్లో సాహిత్యానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అందరికి తెలిసిందే. కేవలం సాహిత్యం కోసమే పాటలు వినే ప్రేక్షకులు ఉంటారని చెప్పనవసరం లేదు.. ఆకాలం నుంచి సాహిత్య విలువలని పెంచుతూ వస్తున్నారు ఎంతోమంది గీత రచయితలు.. ఈ తరం గీతరచయితలు కూడా అవే సాహిత్య విలువలు పెంచుతూ ముందుకు వెళ్తున్నారు.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి, రామజోగయ్య శాస్త్రి, అనంత్ శ్రీరామ్, చంద్రబోస్ లాంటి వారు తెలుగు సాహిత్యాన్ని మరోమెట్టు పెంచుతూ పోతున్నారు..

ఇక చంద్రబోస్ గురించి చెప్పాలంటే సుప్రసిద్ధమైన సాహిత్యానికి, ఈ తరానికి తగట్లు పాటలు రాయగల గీత రచయిత గ చంద్రబోస్ ఎల్లప్పుడూ ముందు ఉంటారు..తాజ్ మహల్ సినిమాకి తొలుత పాట రాసే అవకాశం దక్కించుకున్న చంద్రబోస్ ఆ తర్వాత ఎనుతిరిగి చూసుకోలేదు.. సరళమైన పదాలతో, ప్రేక్షకులను నాది తెలుసుకుని పాట రాయడం అయన స్పెషాలిటీ.. అందుకే అయన వెంట దర్శక నిర్మాతలు కోకొల్లలుగా తమ పాటలు రాయమని వెంటపడుతుంటారు. అలాంటి అయన ప్రొఫెషనల్ కెరీర్ గురించి అందరికి తెలిసిందే అయినా పర్సనల్ లైఫ్ గురించి ఇప్పుడు మనం చెప్పుకోవాలి. సినిమా ఇండస్ట్రీ లో పనిచేసే వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి వారి మధ్య ప్రేమ చిగురించి పెళ్లి దాకా వెళ్లిన జంటలు చాలానే ఉన్నాయి.
అలాంటి వారిలో ఒకరు చంద్రబోస్, సుచిత్ర జంట.. కొరియోగ్రాఫర్ అయిన సుచిత్ర గారిని చంద్రబోస్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రాఘవేంద్ర రావు గారు తీసిన ఆఖరిపోరాటం సినిమాతో కొరియోగ్రాఫర్ గా మారిన సుచిత్ర గారిని చంద్రబోస్ గారు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.ఆఖరి పోరాటం సినిమా తర్వాత ఆవిడ చైతన్య,మనీ,గాండీవం, వినోదం, నువ్వు నాకు నచ్చావ్ లాంటి చాలా సినిమాలకి కొరియోగ్రాఫర్ గా వర్క్ చేశారు.అలాగే కొరియోగ్రాఫర్ గా కూడా ఆమె చాలా అవార్డ్స్ అందుకున్నారు.రాఘవేంద్రరావు దర్శకత్వం పర్యవేక్షణలో బ్రహ్మానందం కొడుకు గౌతమ్ హీరోగా పరిచయం చేస్తూ రతి ఆర్ముగం హీరోయిన్ గా పరిచయం అవుతూ చేసిన పల్లకిలో పెళ్లికూతురు సినిమాకి సుచిత్ర గారే దర్శకత్వం వహించారు.ప్రస్తుతం సుచిత్రా సినిమాలలో కొరియోగ్రఫీ చేస్తూ బిజీగా ఉంటున్నారు.



























