బాలకృష్ణ – నాగబాబుల వివాదం టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. మంచికి పోతే చెడు ఎదురైందని సామెత ఇప్పుడు టాలీవుడ్ కి వర్తించేలాగే ఉంది. కరోనా లాక్ డౌన్ వలన తెలుగు చిత్రసీమ ఎదుర్కొంటున్న సమస్యలకో పరిష్కారం చూపడానికి మెగాస్టార్ చిరంజీవి మరికొందరు చొరవ తీసుకుని షూటింగ్ లు ప్రారంభించే విషయమై ప్రభుత్వంలో చర్చలు జరుపుతున్న నేపద్యంలో ప్రముఖ నటుడు, హిందుపూర్ టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపగా, దానికి నాగబాబు కౌంటర్ మరింత సంచలనం సృష్టించింది.

అయితే నిర్మాత సి.కళ్యాణ్ మాట్లాడుతూ మూవీ ఆర్టిస్ట్ట్స్ అసోసియేషన్ వారు బాలకృష్ణను సమావేశాలకు పిలిచి ఉండాల్సిందని కామెంట్ చేశారు. ఇందుకు మూవీ ఆర్టిస్ట్స్ అద్యక్షుడు నరేష్ స్పందిస్తూ, తననే ఆ మీటింగ్ కు పిలవలేదని, అలాగే మా సెక్రటరీని కూడా పిలవలేదని, అలాంటప్పుడు తాము బాలకృష్ణను ఎలా పిలుస్తామని ప్రశ్నించారు. సి.కళ్యాణ్ వ్యాఖ్యలు తమను షాక్ కు గురి చేశాయని అన్నారు.

ఇదిలావుండగా మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ వద్ద కూర్చుని భూములు పంచుకుంటారా అని సినీ ప్రముఖులను ఉద్దేశించి బాలకృష్ణ వ్యాఖ్యానించగా, ఎపిలో టిడిపి వారు చేసిన రియల్ ఎస్టేట్ స్కామ్ వల్ల సామాన్యులు నాశనం అయ్యారని నాగబాబు సంచలనంగా వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. రోజురోజుకీ ముదురుతున్న ఈ మాటల యుద్ధం క్లైమాక్స్ ఎలా వుంటుందో వేచి చూద్దాం.




























