ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు హాట్ టాపిక్ గా మారాయి.
ఈ క్రమంలోనే ఈ ఎన్నికల గురించి రోజుకో వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతూ సంచలనంగా మారింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి మా ఎన్నికలు ఎంతో రసవత్తరంగా కొనసాగుతున్నాయి. ఎన్నికల తేదీ ప్రకటించినప్పటి నుంచి ఎన్నికల్లో ప్రచారాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఇప్పటికే మా అధ్యక్షుడిగా ఎన్నికల బరిలో దిగనున్న ప్రకాష్ రాజ్ తన ప్యానెల్ సభ్యులను ప్రకటించారు.

ఎన్నికల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రకాష్ రాజ్ ప్యానెల్ సభ్యులతో శనివారం సమావేశమై ఆదివారం అందరినీ భోజనానికి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే నిర్మాత బండ్ల గణేష్ ని కూడా విందు కార్యక్రమానికి ఆహ్వానించారు. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో ఓ వీడియోను వదులుతూ మా విందు ఆహ్వానానికి అభ్యంతరం వ్యక్తం చేశారు.

బండ్ల గణేష్ మొదటి నుంచి ప్రకాష్ రాజు ప్యానెల్ సభ్యుడిగా ఉంటూ అతనికి మద్దతు తెలిపారు.ఆఖరి నిమిషంలో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి జనరల్ సెక్రటరీగా జీవిత రాజశేఖర్ పోటీలోకి దిగడంతో ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి బండ్ల గణేష్ తప్పుకొని జీవిత రాజశేఖర్ పై పోటీకి సిద్ధమయ్యారు.ఇలాంటి సమయంలో ప్రకాష్ రాజ్ మా విందుకు ఆహ్వానించడంతో బండ్లగణేష్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాడు.
It’s my humble request ???? pic.twitter.com/fFaXAiEK4g
— BANDLA GANESH. (@ganeshbandla) September 12, 2021
ఈ సందర్భంగా బండ్ల గణేష్ మాట్లాడుతూ.. దయచేసి మా కళాకారులందరిని విందులు, సన్మానాల పేరుతో ఒక చోటకు చేర్చవద్దూ. ఇప్పటికే కరోనా వల్ల చాలా మంది ఆర్టిస్టులు చావు వరుకు వెళ్లి బతికి బయటపడ్డారు. అలాంటి వారిలో తాను ఒకరిని, కావాలంటే మీరు ఫోన్ చేసి ఏయే అభివృద్ధి పనులను చేస్తారో చెప్పండి కానీ ఇలా అందరినీ ఒక చోటకు చేర్చి కళాకారుల ప్రాణాలతో చెలగాటమాదద్దు అంటూ బండ్ల గణేష్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.



























