Madhavi Latha : సినిమాలలో నటించే నటీనటులు సినిమాలలో అవకాశం వచ్చినా రాకపోయినా సోషల్ మీడియాలో మాత్రం అభిమానులకు చేరువగా ఉంటారు. అభిమానులకి ఎప్పుడూ చేరువలో ఉండడానికి వారికి ఇది ఒక ఉత్తమమైన మార్గం. కాకపోతే నటీనటులు సోషల్ మీడియా ద్వారా ఏదైనా పోస్ట్ చేసిన, కొంతమంది నెటిజెన్ ల నుంచి విచిత్రమైన కామెంట్ లను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇలాంటి సంఘటనను నటి మాధవీ లత ఎదుర్కొంది.

మాధవీ లత, తనీష్ హీరోగా రవిబాబు దర్శకత్వం లో వచ్చిన నచ్చావులే సినిమాతో తెలుగు సినిమాల్లో కి అడుగు పెట్టింది. తరువాత స్నేహితుడా సినిమాతో అభిమానులను సంపాదించుకుంది. ప్రస్తుతం చలన చిత్ర రంగానికి దూరంగా వున్నా సోషల్ మీడియా లో మాత్రం అభిమానులకు టచ్ లోనే ఉంటుంది. అయితే మాధవి ఏపీ రాజకీయలలోకి కూడా ప్రవేశించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం మాధవి పెట్టిన ఒక పోస్ట్ కు నెటిజెన్ పెట్టిన కామెంట్, దానికి మాధవి చెప్పిన సమాధానం హాట్ టాపిక్ గా వుంది.
నిన్ను హౌలే, గూట్లే అని తిట్టాలనుంది కానీ అలా చేయను…
నేటిజన్స్ చేసే తప్పుడు కామెంట్లకు ఘాటుగా స్పందించే మాధవి తాజాగా సోషల్ మీడియా ద్వారా ఒక పోస్ట్ చేసింది. ఇటీవల మాధవీ లత బెజవాడ దుర్గమ్మ దర్శనం చేసుకుంది. అమ్మవారి బంగారు వాకిలి దర్శనం చాలా బాగా జరిగిందని పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ చూసిన ఒక నెటిజన్ కొంచం విచిత్రంగా కామెంట్ చేశాడు. అక్కా అంటూనే నిన్ను పెళ్లి చేసుకోవాలని ఉందని, నువ్వంటే చాలా ఇష్టం అక్కా, పెళ్లి చేసుకుందామా? అని అన్నాడు.
నెటిజెన్ చేసిన ఈ కామెంట్ కు మాధవి లత కూడా తనదైన రీతిలో స్పందించింది అక్కని పెళ్లి చేసుకుంటావా.. హౌలే, గూట్లే అని అనాలని ఉంది కాని అనను అంటూ రిప్లై ఇచ్చింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.































