“నచ్చావులే” చిత్రం ద్వారా టాలీవుడ్ కు పరిచయమై.. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ పై ససంచలన కామెంట్స్ చేస్తూ పాపులరైన ప్రముఖ నటి, బీజేపీ నాయకురాలు మాధవి లత సోషల్ మీడియాలో ఈమధ్య పెట్టిన ఒక పోస్ట్ బాగా వైరల్ గా మారింది.

ఆ పోస్టులో ఆమె ‘‘ఎన్నో నెలల తర్వాత నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. కొత్త జీవితం ప్రారంభమైంది. అద్భుతాలు జరిగాయి. నేను ఎప్పుడూ అద్భుతాలను నమ్ముతుంటాను. చాలా సంతోషంగా ఉంది. వివరాలు త్వరలోనే తెలియజేస్తాను..’’ అని కామెంట్ చేశారు. దాంతో సోషల్ మీడియాలో మాధవీలత పెట్టిన పోస్ట్ వెంటనే సంచలనమై ,మాధవీలత పెళ్లి ఖాయమైపోయిందని గాసిప్స్ ను పుట్టించేలా చేసింది. ఇంకొంతమంది ఫ్యాన్స్ అయితే ఏకంగా ఆమె బీజేపీలోని ఇక యువ నాయకుడితో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిందని, త్వరలోనే అతడిని పెళ్లి చేసుకోబోతుందని, అందుకే త్వరలో వివరాలు వెల్లడిస్తాను అని పెట్టిందనే గాసిప్ వివాదస్పదమైంది.

సెలెబ్రిటీల విషయంలో ఇలాంటి పుకార్లు బయటకొస్తేనే స్టోరీలు అల్లేసే మీడియా మాధవీలత విషయంలోనూ అదే పని చేసింది. అందులోనూ ఓ ప్రముఖ హీరోయిన్ పెళ్లి విషయంలో గాసిప్. దీన్ని అన్ని మీడియా చానళ్ళు కూడా తెగ ప్రచారం చేసేసాయి. ఇవన్నీ గమనించిన మాధవీలత ఇక ఈ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకుని తన పేస్ బుక్ ఖాతాలో మరో పోస్టును పెట్టింది. అందులో తన పెళ్లి వార్తల్లో ఏమాత్రం నిజం లేదని ఖండిస్తూ.. తనకు ఎలాంటి వ్యక్తి అంటే ఇష్టమో కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ.. ఫేక్ గాసిప్స్ ను క్రియేట్ చేసే నెటిజన్లకు గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది.

“నాపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలకి సంతోషం. శుభం పలకడం కూడా మంచి శకునమే. కాకపోతే అందరికి ఒక విన్నపము. నాకు దమ్ము, దైర్యం రెండు ఎక్కువే.. నేనెవరినైనా ప్రేమించినా.. అతడినే పెళ్లి చేసుకున్నా దైర్యంగా చెప్పేస్తాను. నాలాగే దమ్ము, దైర్యం ఉన్న మగాడంటేనే ఇష్టపడతాను. అంతే కానీ ఇష్టాన్ని ప్రేమని దొంగలా దాచుకుని సమాజానికి భయపడే పిరికివాళ్ళంటే నాకు చిరాకు. మాధవి లతని ప్రేమిస్తున్నాను. ఆమెనే పెళ్లి చేసుకుంటానని దమ్ముగా చెప్పే వాడితోనే స్నేహం గొప్పగా ఉంటుంది. కాబట్టి మీడియా మిత్రులందరికీ, అలాగే నా ఫ్యాన్స్ కి, ఫాలోయర్స్ కి చెప్పేది ఏమనగా కాస్త ఆగండి. తొందర పడకండి. ఏదైనా నేను చెప్పే చేస్తాను. నేను మీరనుకునేంత పిరికిదాన్ని కాదు. ఆలా అని పిరికివాడిని నేను భర్తగా ఒప్పుకోను. సోషల్ మీడియా అన్నాక ఇలా నెగెటివ్ కామెంట్స్ రావడం సహజం. విమర్శిస్తే ఓకే కానీ ఇష్టం వచ్చినట్టు తిడితే కుదరదని తెలిపింది. తనది వెరిఫైడ్ ఖాతా అని, ఇప్పటి వరకు 1.26లక్షల అకౌంట్స్ తీసేశామని, పిచ్చి పిచ్చిగా కామెంట్స్ పెడితే బ్లాక్ చేస్తానని ఈ సందర్భంగా నెటిజన్లను హెచ్చరించింది. మాధవీ లతనా.. మజాకా.!



























