ఆగలేకపోతున్నావా? మాస్క్ తోనే పెళ్లి చేసుకోవాలా? యువ హీరోను టార్గెట్ చేసి వ్యాఖలు చేసిన మాధవిలత!?

0
344

మాధవిలత “నచ్చావులే” సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తరువాత కొన్ని సినిమాలు చేసి నటనకు కాస్త విరామం తీసుకుని రాజకీయాలలో అడుగుపెట్టింది. గత ఎన్నికల్లో బిజెపి తరుపున పోటి చేసింది ఓటమిపాలైంది. అయితే నిత్యం సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే ఈ భామ అప్పడప్పుడు కొన్ని వివాదాస్పద కామెంట్లు కూడా చేస్తుంటారు. ఈ నేపధ్యంలో తాజగా లాక్ డౌన్ సమయంలో పెళ్లి చేసుకున్న కొంతమందిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది మాధవిలత.

వివరాల్లోకి వెళితే “పెళ్ళికి ముహూర్తం మళ్ళి రాదా? ఇప్పుడు కాకపొతే వచ్చే ఏడాది పెళ్లి చేసుకోవచ్చు కదా.. పిల్ల దొరకదా? పిల్లోడు పారిపోతడా? అలా మారిపోయే మనుషులతో బంధాలు ఎందుకు? మాస్క్ ల ముసుగులో పెళ్ళి అవసరమా? కొన్నాళ్ళు ఆగలేని వీరు సంసారాలు చేస్తారా?” అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్టు పై నెటిజన్లలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నెటిజన్లు కూడా రకరకాల కామెంట్లు పెడుతున్నారు. నీకెందుకు ఆని కొందరు.. సూపర్ చెప్పావ్ మాధవీలత ఆని మరికొందరు ఇలా రకరకాల కామెంట్లు పెడుతూ తమ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. అయితే మాధవిలత తాజగా పెళ్లి చేసుకున్న యువహీరోను ఉద్దేశించే ఈ పోస్టు పెట్టిందంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here