మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్‌పై మంచు విష్ణు పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే మా ఎన్నికల్లో పోలింగ్ కేంద్రం వద్ద శివబాలాజీ చేయిని సినీ నటి హేమ కొరకడం చర్చకు దారి తీసింది.

పోలింగ్ కేంద్రంలోకి తాను వెళ్తున్న క్రమంలో శివబాలాజీ చెయ్యి అడ్డుగా పెట్టాడని.. చేయి తీయమంటే తీయలేదని అందుకే చేయి కొరకాల్సి వచ్చిందని హేమ క్లారిటీ ఇచ్చింది. కాగా హేమ కొరకడంతో శివబాలాజీ చేతిపై గాయం అయింది. ఇది సెప్టిక్ అవుతుందన్న భయంతో ఓటింగ్ అనంతరం నిమ్స్ కి వెళ్లారు. గాయానికి చికిత్స తీసుకున్నారు.
ఫస్ట్ ఎయిడ్ కోసం ఆస్పత్రికి వచ్చానని మీడియాతో శివబాలాజీ అన్నారు. హ్యూమన్ బైట్ కదా అని టీటీ ఇంజెక్షన్ వేయించుకున్నట్టు చెప్పారు. డాక్టర్లు తనకు యాంటిబయోటిక్స్ ఇచ్చి.. కట్టు కట్టారని తెలిపారు. అయితే ఈ ఘటనపై శివబాలాజీ భార్య మధుమిత తీవ్రంగా స్పందించారు. ఇలాంటి పనులు ఎవరైనా మనుషులు చేస్తారా.. మనుషులు చేసే పనులేనా అంటూ ఘాటుగా విమర్శించారు.
ఇంత కంటే తాను ఇంకేమి చెప్పను అంటూ అన్నారు. ఇక తన భర్త శివబాలాజీ గెలవడంపై హర్షం వ్యక్తం చేసింది మధుమిత. ఇలాంటి స్వార్థాలకు పోకుండా.. ఎలాంటి ద్వేశాలకు పోకుండా చేసే పనిలో నిమగ్నమైతే ఫలితాలు ఇలానే ఉంటాయన్నారు. నిస్వార్థంగా సేవ చేసినప్పుడే ప్రతిఫలం కచ్చితంగా ఉంటుందని ఆమె అన్నారు. ఈ ఎన్నికల్లో ‘మా’ కోశాధికారి (ట్రెజరర్)గా శివబాలాజీ పోటీ చేసి నాగినీడుపై విజయం సాధించారు.





























