Madhumitha: ఇది మా అశోక్ గాడి లవ్ స్టోరీ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటుడు శివ బాలాజీ. అనంతరం ఈయన నటి మధుమితతో కలిసి పలు సినిమాలలో నటించారు.ఇలా నటిగా వీరిద్దరూ పలు సినిమాలలో నటించడంతో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి ఆ ప్రేమ పెళ్లి వరకు దారి తీసిందని చెప్పాలి ప్రస్తుతం ఈ దంపతులు ఇద్దరు పిల్లలతో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు.

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి వీరిద్దరూ తమ ప్రేమ గురించి పలు విషయాలను తెలియచేశారు. ఈ క్రమంలోనే నటి మధుమిత మాట్లాడుతూ ఇది అశోక్ గాడి లవ్ స్టోరీ సినిమా సమయంలో శివ బాలాజీని చూసి అబ్బాయి బాగున్నాడు అనిపించింది అయితే ఇంగ్లీష్ కరన్ సినిమా షూటింగ్ సమయంలో దర్శకుడు పరిచయం చేయగా తనతో పరిచయం ఏర్పడిందని ఈమె తెలియజేశారు.
ఇక ఇద్దరి మధ్య హాయ్ అంటే హాయ్ అంతవరకే పరిచయం ఉండేదని తెలిపారు. కానీ శివ బాలాజీ మాత్రం తన దృష్టిలో పడటానికి ఎన్నో పనులు చేసే వాళ్ళని ఈ సందర్భంగా మధుమిత తెలియజేశారు. నేను లిప్స్టిక్ వేసుకున్న తర్వాత దానిని తుడిచిపడేసిన టిష్యూ పేపర్ కూడా దాచుకున్నారని ఈమె తెలియజేశారు.

Madhumitha: శివ బాలాజీ ముందుగా ప్రపోజ్ చేశారు..
ఇక తాను చెన్నై వెళుతుండగా మిస్ అవుతున్నాను అంటూ ఈయన మెసేజ్ చేశారు. ఆ మెసేజ్ చూడగానే తనని దూరం పెట్టే ప్రయత్నం చేశాను కానీ శివబాలాజీ మాత్రం నాకు దగ్గర అవడానికి ప్రయత్నాలు చేశారు. ఇక ఒక రోజు అయితే పెళ్లి చేసుకుందామా అంటూ తానే నాకు ప్రపోజ్ చేశారంటూ మధుమిత చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.పెళ్లి జరగడానికి ఎన్నో ఇబ్బందులు కూడా ఎదురయ్యాయి అంటూ ఈ సందర్భంగా ఈ జంట తెలియజేశారు.