ఈ పోటీ ప్రపంచంలో ప్రతి వస్తువు ప్రజల వద్దకు వెళ్లాలి అంటే దానికి సంబంధించిన ప్రకటనలు తప్పనిసరిగా చేయాల్సి ఉంటుంది. వస్తువు ఎంత నాణ్యతతో కూడినదైన దానికి సరైన ప్రకటనలు చేయనప్పుడు అది కేవలం తయారుచేసిన పరిశ్రమకే పరిమితమవుతోంది. అలాంటి క్రమంలో తయారీ వస్తువుకు ప్రకటన చేయడం అనేది అత్యంత ప్రాముఖ్యంగా నిలిచిపోయింది. అలాంటి క్రమంలో ప్రజలు వేటి మీద అయితే ఖర్చు చేస్తారో అటువంటి వస్తువులకు ప్రజలకు తెలిసేలా వివిధ రకాలైన దిన, వార పత్రికలలో ప్రకటనలు ఇవ్వడం ఆనాటి నుంచి వస్తుంది.

తరువాత రేడియో, ఆ తర్వాత టెలివిజన్, సోషల్ మీడియా ఇలా ప్రకటనలు అనేవి తరం మారినా కొద్ది రకరకాలుగా మాధ్యమాల్లో ప్రకటనలు రావడం మనం గమనిస్తున్నాం. అయితే ప్రకటనలు చేయడం అనేది ప్రజల్లో అత్యంత ఆదరణ ఉన్న సెలబ్రిటీలు అయితే ఆ వస్తువును ప్రజలు ఎక్కువగా చూసే అవకాశం ఉంది. కావున స్పోర్ట్స్, సినీ సెలబ్రిటీస్ చే రకరకాల వస్తువులపై ప్రకటనలు చేయించడం మనం టెలివిజన్, సోషల్ మీడియాలో చూస్తున్నాం. బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ పెప్సీ, నవరత్న, హ్యాపీ ఫిజ్ లాంటి ప్రకటనల్లో కనిపించడం జరుగుతుంది. పారగాన్ చెప్పుల వాడకంలో హృతిక్ రోషన్ ఒక యాడ్ చేయడం జరిగింది. హార్పిక్ వాడాలంటూ అక్షయ్ కుమార్ ఒక ప్రకటనలో కనిపించారు. మజా ఫ్రూట్ జ్యూస్ తాగాలంటూ అదితీరావ్, రకుల్ ప్రీత్ సింగ్ ఒక యాడ్ చేశారు. ఇక టాలీవుడ్ లో సినిమాల్లో బిజీగా ఉంటూ అప్పుడప్పుడు మహేష్ బాబు థమ్సప్, సంతూర్ సబ్బుకు ప్రకటనలు చేస్తున్నాడు. స్ప్రైట్ సాఫ్ట్ డ్రింక్ కు నాని ప్రకటన చేస్తుండగా, కీర్తి సురేష్ డాబర్ ఆమ్లాకు ఒక యాడ్ లో కనిపించారు.

ఇక 1909లో భారతదేశంలో పరిచయమైన లక్స్ సబ్బుకు మొదటగా బాలీవుడ్ లో లీల, హేమమాలిని, మధుబాల, మాధురి దీక్షిత్, శ్రీదేవి, జుహీ చావ్లా హీరోయిన్లు అంబాసిడర్ గా చేశారు. ఆ తర్వాత ప్రాంతీయంగా లక్స్ సబ్బు కోసం రీజినల్ యాడ్స్ ఇవ్వడం జరిగింది. అందులో తెలుగులో నుంచి మొదటగా 1960 ప్రాంతంలో సావిత్రి మొదటి లక్స్ బ్యూటీగా దినపత్రికల్లో కనిపించగా, ఆ తర్వాత జయప్రద, ఆసిన్, శ్రీయ శరణ్, కాజల్ అగర్వాల్, సమంత మొదలగువారు లక్స్ సబ్బుకు అంబాసిడర్ గా వ్యవహరించారు. అలా అలనాటి హీరోయిన్ సావిత్రి లక్స్ సబ్బుకు ఆ రోజుల్లోనే అంబాసిడర్ గా వ్యవహరించారు. అయితే లక్స్ సబ్బు యాడ్ చివర సావిత్రి జెమిని గణేషన్ అని రాసి ఉండడం ఒక విశేషం.



























