Mahesh Babu : హీరోలు సినిమాలలో విరామం దొరికినపుడు విదేశాలకు వెళ్ళిపోవడం మామూలే. ఇక ఇలాంటి హీరోల్లో మహేష్ బాబు ముందుంటారు. తన ఫ్యామిలీతో టైం గడపడానికి మహేష్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. చిన్నదో పెద్దదో తన కుటుంబంతో కలిసి ఏదోక ప్రదేశానికి వెళ్ళిపోయి మళ్ళీ ఆ తరువాత కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసుకుంటారు. అలా ఇప్పుడు కూడా మహేష్ అమెరికా వెళ్లారు. తన కుటుంబంతో కలిసి అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు.

ఆస్తులు కొంటున్న మహేష్…
అమెరికా ట్రిప్ ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అయితే అసలు ట్రిప్ వెనుక రహస్యం వేరే ఉంది. కేవలం చూడ్డానికి మాత్రమే అమెరికా వెళ్ళలేదు, అక్కడ ఆస్తులు కొనుగోలు చేయాలని మహేష్ భావిస్తున్నారు. ఆయనకు సన్నిహితుడైన అనిల్ సుంకర సలహా మేరకు మహేష్ అమెరికాలో ఒక ప్రాపర్టీ ని కొన్నారు, దాని విలువ 50 కోట్లు ఉంటుందని అంచనా. అలా విదేశాల్లో ఆస్తులను కొంటున్నారు మహేష్. ఇక డార్లింగ్ ప్రభాస్ కూడా విదేశాల్లో ప్రాపర్టీస్ కొంటున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

మహేష్ బాబు తాజాగా నటించిన సర్కారు వారి పాట సినిమా మంచి విజయం పొందింది. ఇక మహేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో చేయనున్నారు. ఖలేజా సినిమా తరువాత చాలా రోజులకు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. త్రివిక్రమ్ సినిమా పూర్తయ్యాక మహేష్ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా రాబోతోంది. అసలే మహేష్ ఫ్యాన్స్ రాజమౌళి మహేష్ కాంబో సినిమా కోసం బాగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు మొదలు పెట్టారు రాజమౌళి.































