Mahesh Babu : టాలీవుడ్ ప్రిన్స్ సూపర్ స్టార్ మహేష్ బాబు చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాలకు పరిచయం అయ్యి ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా కెరీర్ ప్రారంభించాడు. అప్పటి నుండి ఇప్పటి వరకూ అభిమానులలో మహేష్ బాబు అంటే క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇక ఇపుడు మహేష్ బాబు తన గారాల పట్టి అయిన సితారతో కలసి ఒక టీవీ ఛానల్ లో ప్రసారమవుతున్న డాన్స్ ఇండియా డాన్స్ అనే ప్రోగ్రాంలో పాల్గొంటున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ ప్రోగ్రాంకు సంబందించిన ప్రోమోలు ఇప్పటికే బాగా పాపులర్ అయ్యాయి. అయితే తాజాగా ఈ ప్రోగ్రాంకు సంబందించిన మరొక ప్రోమో ఇపుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

రౌడీ రోహిణి ని పొగడ్తలతో ముంచెత్తిన మహేష్…
జబర్దస్త్ ప్రోగ్రాంలో తన కామెడీతో అందరినీ ఆకట్టుకుంటున్న రోహిణి, ప్రస్తుతం డాన్స్ ఇండియా డాన్స్ అనే ప్రోగ్రాంకు హోస్ట్ గా వ్యవహారిస్తున్నట్ట సమాచారం. అయితే ఈ ప్రోగ్రాం మొదటి ఎపిసోడ్ కు మహేష్ బాబు సితారతో కలసి సందడి చేసిన ప్రమోలు కూడా ఇప్పటికే సందడి చేసాయి. ఈ వీడియోలో రోహిణి పిలిచినా రానంటావా పాటతో ఎంట్రీ ఇవ్వగా.. మహేష్ తన స్టైల్ పంచులు వేసాడు. వీరిద్దరి మధ్య జరిగే సంభాషణ కూడా అందరినీ ఆకట్టుకుంటోంది.

నేను హీరోయిన్ అవ్వాలి అంటే ఏమి చేయాలి అని రోహిణి మహేష్ ను అడుగగా.. అందుకు మహేష్ సినిమాలు చేయాలి అని టైమింగ్ తో వేసిన పంచ్ అందరినీ ఆకట్టుకుంది. తరువాత బుగ్గలు బాగా పెరిగిపోతున్నాయి, మీలాగా స్మార్ట్ గా ఉండాలంటే ఏమి చేయాలి అని రోహిణి ప్రశ్నకు.. మహేష్ బాగానే ఉన్నారుగా బుగ్గలేసుకొని అన్న సమాధానం అందరినీ నవ్విస్తోంది. ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరల్ అవుతోంది.



























