Mahesh Babu : మహేష్ బాబు, కీర్తీ సురేష్ జంటగా నటించిన సర్కారు వారి పాట సినిమా మే 12 న విడుదలకు సిద్ధమైంది. ఇక సినిమా ప్రచారాల్లో భాగంగా పలు ఇంటర్వ్యూల్లో చిత్ర యూనిట్ సందడి చేస్తోంది. ఇక మహేష్ బాబు తో బిత్తిరి సత్తి చేసిన ఇంటర్వ్యూ చాలా సరదాగా సాగిపోయింది. ఇక సత్తి మాటలకు మహేష్ టైమింగ్ సటైర్లు జోడి అయి ఇంటర్వ్యూ బాగా నవ్వులు పూయించింది. సినిమా గురించిన వివరాలు, విశేషాల గురించి ఇంటర్వ్యూ లో మాట్లాడారు. ఇక మహేష్ అయితే ఇంటర్వ్యూ మొత్తం సత్తి మాటలకు నవ్వుతూనే ఉన్నాడు.

నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావా ….
ఇంటర్వ్యూ మధ్యలో మహేష్ బాబు, బిత్తిరి సత్తి మీద సీరియస్ అయ్యాడు. సినిమా గురించి మాట్లాడుతూ సెకండ్ హాఫ్ మొత్తం వైజాగ్ చేపల మార్కెట్ లో ఉంటుందట కదా మహేష్ ను బిత్తిరి సత్తి ప్రశ్న అడిగారు ఇక మహేష్ బాబు మాట్లాడుతూ అమెరికా నుండి వచ్చి ఇక వైజాగ్ లో కథ సాగుతుంది అని చెప్పగా బిత్తిరి చేపల మార్కెట్ లోనే మొత్తం సాగుతుందట కదా అని అడుగగా మహేష్ కాస్త సీరియస్ అయ్యారు “నీ ఇష్టం…. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడేస్తావా” అంటూ చురకలేశారు. ఇక ఆ తరువాత వెంటనే బిత్తిరి” అవును సార్ మాట్లాడుతాను నాకు ఆ లైసెన్స్ ఇచ్చారు “అనగానే మహేష్ నవ్వేసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.
రేపు విడుదలకు సిద్ధమైన సర్కారు వారి పాట సినిమాను మైత్రి మూవీస్, 14 రీల్స్ ఎంటర్టైన్ మెంట్, జీఎంబి ఎంటర్టైన్ మెంట్స్ సంయుక్తంగా నిర్మించాయి. ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమా పై అంచనాలను పెంచేసింది. ఓ వైపు క్లాస్ మరో వైపు మాస్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక రెండేళ్ల గ్యాప్ తరువాత వస్తున్న మహేష్ బాబు చిత్రం కావడంతో అభిమానులు బాగా వెయిట్ చేస్తున్నారు



























