Mahesh Babu: టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు పొందిన సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి తెలియని వారంటూ ఉండరు. సూపర్ స్టార్ కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మహేష్ బాబు తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ స్టార్ హీరోగా నిలిచాడు. ఇదిలా ఉండగా తేడా అది మహేష్ బాబు కుటుంబంలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి.

మొదట మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు అనారోగ్యం కారణంగా మృతి చెందాడు. రమేష్ బాబు మృతి చెందిన కొంతకాలానికే మహేశ్ బాబు తల్లి వసుంధర దేవి కూడా అనారోగ్యంతో మృతి చెందింది. ఆమె మరణించి ఆరు నెలలు కూడా గడవకముందే కృష్ణ గారు కూడా మృతి చెందారు. ఇలా తల్లి, తండ్రి, సోదరుడిని పోగొట్టుకొని మహేశ్ బాబు విషాదంలో మునిగిపోయారు. అయితే పోయిన వారు తిరిగి రారు కాబట్టి సినిమా షూటింగ్ పనులతో బిజీ అయ్యి ఇప్పుడిప్పుడే ఆ బాధ నుండి బయటపడుతున్నాడు.
ఇక తాజాగా తల్లి ఇందిరా దేవిని గుర్తు చేసుకుంటూ మహేశ్ బాబు ఒక ఎమోషనల్ పోస్ట్ షేర్ చేశాడు. నేడు ఇందిరా దేవి పుట్టిన రోజు కావడంతో తల్లిని గుర్తు చేసుకుంటూ తల్లితో కలిసి దిగిన ఓ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘పుట్టిన రోజు శుభాకాంక్షలు అమ్మ… ప్రతిరోజూ నీకు కృతజ్ఞుడను’. అంటూ ఎమోషనల్ అయ్యారు.

Mahesh Babu: త్రివిక్రమ్ సినిమాతో బిజీగా మహేష్…
ప్రస్తుతం మహేష్ బాబు షేర్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మహేష్ అభిమానులు కూడా ఇందిరా దేవి పుట్టిన రోజు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మహేష్ బాబుని ఓదారుస్తున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల సర్కారు వారి పాట సినిమా ద్వారా మంచి హిట్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఆ సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రాబోయే సినిమాలో నటించనున్నాడు.
“Happy birthday Amma.. Grateful for you everyday” – @urstrulyMahesh via Instagram.
Remembering Indira Devi garu on her birth anniversary ???????? !!! pic.twitter.com/UMpdu1akMR
— Mahesh Babu News ???? (@MaheshBabuNews) April 20, 2023





























