Mahesh babu family stays in a luxuary hotel : సర్కారు వారి పాట సినిమా షూటింగ్ పూర్తవడంతో మహేష్ బాబు ఎప్పటిలాగే కుటుంబంతో కలిసి ట్రిప్ కు చెక్కేశారు. మహేష్ బాబు షూటింగ్ లో కాస్త విరామం దొరికినా ఫ్యామిలీతో గడపడానికి ఆసక్తి చూపుతారు. ఇక ప్రతిసారి విదేశాలకు వెళ్లే మహేష్ బాబు ఈ సారి కూడా ప్యారిస్ కి వెళ్లారు. అయితే ఎప్పుడు ప్యారిస్ వెళ్లినా మహేష్ బాబు దిగే హోటల్ ఒకటేనట. ప్యారిస్ వెళ్లినప్పుడల్లా అక్కడున్న లగ్జరీ హోటల్ లీ బ్రిస్టల్ ప్యారిస్‌లో దిగడం మహేశ్‌బాబుకు అలవాటు. ఆ హోటల్‌లో జూనియర్ సూట్‌కు రెంటే ఇపుడు అందరిని అవాక్కయ్యేలా చేస్తోంది. రోజుకు లక్షన్నర రూపాయల రెంటును వసూలు చేస్తున్నారు. ఇక మహేష్ ఫ్యామిలీ ప్రతిసారి ఆ హోటల్ కే వెళ్తారట.

మన సూపర్ స్టార్ రేంజ్ అది మరి. ఇక ఇపుడు నమ్రత తన కూతురు సితారతో కలిసి హోటల్ లాబీలో ఓ పెయింటింగ్ ముందున్న సోఫాలో కూర్చొని తీసుకున్న ఫోటోను ఇంకా సెల్ఫీ ని ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ అప్పుడు ఇప్పుడు అంటూ పోస్ట్ చేసింది గతంలో తీసుకున్న ఫోటోను ఇపుడు తీసుకున్న ఫొటోకు జత చేసి షేర్ చేసారు. ప్యారిస్‌లో నాకు ఇష్టమైన ప్రదేశాల్లో ఇది ఒకటి’ అని కూడా పేర్కొన్నారు నమ్రత. అలాగే ఫ్యామిలీతో దిగిన సెల్ఫీని, కూతురు సితారతో దిగిన ఫొటోను మహేశ్‌బాబు తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు.
ఇక మహేష్ నటించిన సర్కారు వారి పాట సినిమా అన్ని పనులు ముగించుకుని విడుదలకు సిద్ధమైంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ అభిమానులను ఆకట్టుకుంది. మాస్ అభిమానులతో పాటు క్లాస్ అభిమానులను ఆకట్టుకుంది. ముఖ్యంగా మహేష్ నేను విన్నాను నేను ఉన్నాను అంటూ సీఎం జగన్ డైలాగ్ తో ఆకట్టుకున్నాడు. ఇక చివర్లో చెప్పే ఇట్స్ ఏ బాయ్ థింగ్ అనే డైలాగ్ తో కుర్రకారును ఆకట్టుకున్నాడు.

































