Mahesh Babu feeling proud about his daughter: సూపర్ స్టార్ మహేష్ బాబు తన కొడుకును వన్ నేనొక్కడినే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయం చేసారు.ఇక సర్కారు వారి పాట సినిమాలో పెన్నీ సాంగ్ కు డాన్సు చేసి ఆకట్టుకుంది. ఇక ఈ మధ్య కాలంలో యూ ట్యూబ్ ఛానల్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరైంది.

సామాజిక మాధ్యమంలో చురుకుగా ఉండే సితార సర్కారు వారి పాట సినిమా నుండి కళావతి పాటకు అచ్చం వాళ్ల నాన్నలాగా డాన్స్ చేసి అదరగొట్టింది.చిన్న వయసులోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సితార.ఇప్పటివరకు వెస్ట్రన్ డ్యాన్స్ స్టెప్పులతో ఆకట్టుకున్న సీతూ పాప తొలిసారిగా కూచిపూడి డ్యాన్స్ చేసింది. ఇక మహేష్ బాబు తన గారాల పట్టి సితార కూచిపూడి నృత్యం చూసి మురిసిపోయారు.

నన్ను గర్వపడేలా చేసావ్….
ఇక సోషల్ మీడియా లో ఆ డాన్స్ కు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ ఇలా రాసుకొచ్చారు మహేష్..’సితార మొదటి కూచిపూడి డ్యాన్స్ ఇది. ఈ శుభప్రదమైన శ్రీరామనవమి రోజున ఈ వీడియోను మీతో పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ శ్లోకం రాముడి గొప్పదనాన్ని తెలియజేస్తుంది. ఇక సీతూ పాప అంకితభావం, తన ప్రతిభ చూస్తుంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. నువ్వు నన్ను మరింత గర్వపడేలా చేస్తున్నావు. సితారకు కూచిపూడి నేర్పించిన గురువులకు ధన్యవాదాలు. అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు’ అంటూ మహేశ్ పేర్కొన్నారు. ఇక సితూ పాప చేసిన కూచిపూడి డ్యాన్స్‌పై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Sitara's first Kuchipudi dance recital… Couldn't be happier to present it on this auspicious day of #SriRamaNavami. This Shloka speaks of the greatness of Lord Rama! pic.twitter.com/QKYHqOmXX5
— Mahesh Babu (@urstrulyMahesh) April 10, 2022
ఇక మహేష్ సర్కారు వారి పాట విడుదలకు సిద్ధమవుతున్నవారు. ఈ సినిమా తర్వాత రాజమౌళి కాంబినేషన్ లో సినిమా చేయబోతున్నాడు. ఇక త్రివిక్రమ్ కూడా మహేష్ తో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఏకంగా 8 ఎకరాల్లో భారీ సెట్ కూడా వేస్తున్నారట.



























