Movie News

Mahesh Babu: మహేష్ బాబు లేకపోతే నా పిల్లల చదువులు ఆగిపోయేవి.. మహేష్ మంచి మనసు వెల్లడించిన డైరెక్టర్?

Mahesh Babu: తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న మహేష్ బాబు సినిమాలలో మాత్రమే కాకుండా నిజజీవితంలో కూడా హీరో అని చెప్పాలి.ఈయన సినిమాలలో నటించి కోట్ల రూపాయల పారితోషకం తీసుకొని ఆస్తులను కూడబెట్టటమే కాకుండా తాను సంపాదించిన వాటిలో కొంతమేర సామాజిక సేవా కార్యక్రమాల కోసం ఉపయోగిస్తూ ఎంతో మంచి మనసును చాటుకున్నారు.

Mahesh Babu: మహేష్ బాబుకు యాక్టింగ్ నేర్పింది నేనే… సత్యానంద షాకింగ్ కామెంట్స్!

ఇప్పటికే మహేష్ బాబు తన ఫౌండేషన్ ద్వారా పలు గ్రామాలను దత్తత తీసుకొని ఆ గ్రామాలలో మౌలిక సదుపాయాలతో పాటు ఆ గ్రామంలో చదివే పిల్లలకు డిజిటల్ చదువులను కూడా చెప్పిస్తున్నారు.అదేవిధంగా మహేష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది చిన్నారులకు గుండె ఆపరేషన్లను నిర్వహిస్తూ వారికి పునర్జన్మ కల్పిస్తున్నారు. ఇలా ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి మహేష్ బాబు ఇండస్ట్రీలో చిన్న చిన్న ఆర్టిస్టులకు ఇబ్బందుల్లో ఉన్న వారికి కూడా సహాయం చేసి మంచి మనసును చాటుకున్నారు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ ఈశాన్ సూర్య సైతం తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మహేష్ బాబు తనకు చేసిన సహాయం గురించి తెలియజేశారు.ఈయన డైరెక్టర్ కాకముందు శీను వైట్ల దగ్గర రైటర్ గా పని చేసేవారట ఇలా మహేష్ బాబు శీను వైట్ల దగ్గర సినిమా చేస్తున్న సమయంలో ఆయన తనకు పెద్ద సహాయం చేశారంటూ ఈశాన్ సూర్య వెల్లడించారు. ఒకానొక సమయంలో తనకు అవకాశాలు లేక ఇబ్బందులు పడ్డానని చివరికి నా పిల్లల చదువులు కూడా ఆగిపోయే పరిస్థితి వచ్చిందని తెలిపారు.

Mahesh Babu: మహేష్ బాబు మనసు ఎంతో మంచిది..


ఈ విధంగా పిల్లలు చదువులు ఆగిపోతాయని తెలియగానే ధైర్యం చేసి మహేష్ బాబు దగ్గరకు వెళ్లి సహాయం అడగాలని భావించాను. అక్కడికి వెళ్లి సంకోచిస్తూ ఉండగా మహేష్ బాబు గారే తనని అడిగి విషయం మొత్తం తెలుసుకున్న తర్వాత ఈ మాత్రం దానికి ఎందుకు అలా సంకోచిస్తున్నావ్ అనిచెప్పి వెంటనే మేనేజర్ ని పిలిచి తనకు కావాల్సినవన్నీ ఏర్పాటు చేయమని చెప్పారంటూ ఈ సందర్భంగా డైరెక్టర్ వెల్లడించారు.అలా ఆరోజు మహేష్ బాబు చొరువతోనే నేడు నా పిల్లలు చదువులు ఆగకుండా మంచి చదువులు చదువుతున్నారని మహేష్ బాబు మంచి మనసు గురించి ఈశాన్ సూర్య వెల్లడించారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

వేప ఆకులకే కాదు.. వేప పండుకూ ఔషధ గుణాల ఖజానా.!

భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…

22 hours ago

సిజేరియన్ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్.. అసలు కారణం ఇదేనా?

దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…

22 hours ago

జూన్ 17 తర్వాత ధనయోగం జోరు.. ఈ రాశుల జీవితంలో భారీ మార్పు!

జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…

2 days ago

రజనీకాంత్–భారతీరాజా మధ్య నిజంగా ఏమైంది? అసలు కథ ఇదే!

తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…

2 days ago

బిర్యానీలో ఈగ.. కస్టమర్‌కు కోర్టు షాక్ ఇచ్చిన తీర్పు

పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…

2 days ago

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ హీట్.. రూ.99 కోట్ల ఎకరం భూమి వేలంలోకి!

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…

2 days ago