Movie News

Namrata: మహేష్ బాబుని మొదటిసారి చూడగానే అలాంటి భావన కలిగింది.. నమ్రత కామెంట్స్ వైరల్!

Namrata:సినిమా ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నమ్రత అనంతరం మహేష్ బాబుతో కలిసి వంశీ సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడటం ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు దారితీసిందని అందరికీ తెలిసిందే.

మహేష్ బాబుని వివాహం చేసుకున్న తర్వాత నమ్రత పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. ఇలా ఈమె సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబ బాధ్యతలని ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నమ్రత మహేష్ బాబు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను మొదటిసారి షూటింగ్ లొకేషన్లో మహేష్ బాబుని చూడగానే ఈయన ఏంటి ఇంత రిజర్వ్డ్ గా ఉన్నారు అనే భావన తనలో కలిగిందని నమ్రత వెల్లడించారు.

ఎలాగైనా ఇతనిలో ఉన్నటువంటి  ఆ రిజర్వ్డ్ నెస్ ను బ్రేక్ చేయాలని ప్రయత్నించి అందులో విజయం సాధించానని తెలిపారు.ఇలా మహేష్ బాబుతో తనకు పరిచయం ఏర్పడటం ఆ పరిచయం మెల్లిగా ప్రేమకు దారి తీయడంతో ఇద్దరం పెళ్లి చేసుకున్నామని తెలిపారు. మహేష్ బాబుతో కనుక ఉంటే రోజులు గడిచి పోయేవి కూడా తెలియదని ఈమె తెలిపారు. ఆయన సినిమాలలో మాత్రమే నటిస్తారు నిజ జీవితంలో నటించరని మహేష్ బాబు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు తెలిపారు.

Namrata: మహేష్ భార్యగా ఉండటమే ఇష్టం…

ఇక మహేష్ బాబు నటించిన సినిమాలలో తనకు పోకిరి, మురారి, ఒక్కడు సినిమాలంటే చాలా ఇష్టం.ముఖ్యంగా మురారి సినిమాలో మహేష్ బాబు చాలా క్యూట్ గా ఉంటారు. ఆ సినిమా అంటే తనకు చాలా ఇష్టమని నమ్రత తెలిపారు.మహేష్ బాబుని వివాహం చేసుకున్న తర్వాత తనకు హీరోయిన్ గా ఉండడం కన్నా మహేష్ బాబుకు భార్యగా ఉండటమే ఇష్టమని అందుకే తాను సినిమాలకు దూరమయ్యానని తెలిపారు.ఇలా నమ్రత మహేష్ బాబు గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago