Namrata:సినిమా ఇండస్ట్రీలో నటిగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నమ్రత అనంతరం మహేష్ బాబుతో కలిసి వంశీ సినిమాలో నటించారు. ఈ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడటం ఆ పరిచయం ప్రేమగా మారి పెళ్లి వరకు దారితీసిందని అందరికీ తెలిసిందే.

మహేష్ బాబుని వివాహం చేసుకున్న తర్వాత నమ్రత పూర్తిగా సినిమాలకు దూరమయ్యారు. ఇలా ఈమె సినిమాలకు దూరంగా ఉంటూ కుటుంబ బాధ్యతలని ఎంతో చక్కగా నిర్వర్తిస్తున్నారు. అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి నమ్రత మహేష్ బాబు గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. తాను మొదటిసారి షూటింగ్ లొకేషన్లో మహేష్ బాబుని చూడగానే ఈయన ఏంటి ఇంత రిజర్వ్డ్ గా ఉన్నారు అనే భావన తనలో కలిగిందని నమ్రత వెల్లడించారు.
ఎలాగైనా ఇతనిలో ఉన్నటువంటి ఆ రిజర్వ్డ్ నెస్ ను బ్రేక్ చేయాలని ప్రయత్నించి అందులో విజయం సాధించానని తెలిపారు.ఇలా మహేష్ బాబుతో తనకు పరిచయం ఏర్పడటం ఆ పరిచయం మెల్లిగా ప్రేమకు దారి తీయడంతో ఇద్దరం పెళ్లి చేసుకున్నామని తెలిపారు. మహేష్ బాబుతో కనుక ఉంటే రోజులు గడిచి పోయేవి కూడా తెలియదని ఈమె తెలిపారు. ఆయన సినిమాలలో మాత్రమే నటిస్తారు నిజ జీవితంలో నటించరని మహేష్ బాబు గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు తెలిపారు.

Namrata: మహేష్ భార్యగా ఉండటమే ఇష్టం…
ఇక మహేష్ బాబు నటించిన సినిమాలలో తనకు పోకిరి, మురారి, ఒక్కడు సినిమాలంటే చాలా ఇష్టం.ముఖ్యంగా మురారి సినిమాలో మహేష్ బాబు చాలా క్యూట్ గా ఉంటారు. ఆ సినిమా అంటే తనకు చాలా ఇష్టమని నమ్రత తెలిపారు.మహేష్ బాబుని వివాహం చేసుకున్న తర్వాత తనకు హీరోయిన్ గా ఉండడం కన్నా మహేష్ బాబుకు భార్యగా ఉండటమే ఇష్టమని అందుకే తాను సినిమాలకు దూరమయ్యానని తెలిపారు.ఇలా నమ్రత మహేష్ బాబు గురించి చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.































