కరోనా మహమ్మారి కారణంగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో షూటింగ్ లు లేకపోవడంతో.. మన స్టార్స్ అంతా ఇంటికే పరిమితమయ్యారు. కుటుంబంతో హాయిగా గడిపేస్తున్నారు. ఇప్పటి వరకు మిస్ అయినా టైంని పిల్లలతో ఏంటో సంతోషంగా గడిపేస్తున్నారు. సినిమా షూటింగ్స్ తో ఎప్పుడు బిజీ బిజీ గా గడిపే సూపర్ స్టార్ మహేష్ బాబు గత మూడు వారాలుగా వచ్చిన అనుకోని సెలవులను అదిరిపోయేలా వాడేసుకుంటున్నాడు.

నిత్యం షూటింగ్స్, డబ్బింగ్స్, ప్రమోషన్స్, ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెస్ మీట్స్ అంటూ బిజీ బిజీ గా గడిపే మహేష్ ఇప్పుడు కరోనా కారణంగా వాటన్నిటికి బ్రేక్ రావడంతో కూతురు సితార, కొడుకు గౌతంతో ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. లాక్ డౌన్ 21 రోజులు ఎం చేయాలి అనేదానిపై అయన ప్లాన్ చేసుకున్నాడట. ఈ విషయాన్నీ మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ ట్విట్టర్లోని తన అభిమానులతో పంచుకుంది. షూటింగ్స్ సమయంలో పిల్లలతో గడిపే సమయం దొరకదు అందుకే ఇప్పుడు అనుకోకుండా వచ్చిన ఈ హాలిడేస్ ను పూర్తిగా పిల్లలకోసమే ఇచ్చేశాడట మహేష్. పిల్లలతో ఆడుకోవడం, వెబ్ సిరీస్ లు వదలకుండా చూసేస్తున్నాడట. ఇక సితార అయితే అసలు తండ్రిని ఒక్క క్షణం కూడా వదలడంలేదట. తాజగా మహేష్ తన ట్విట్టర్ ఖాతాలో “క్వారంటైన్ నైట్స్” అంటూ సీతారాతో కలిసి ఆడుకుంటున్న ఫోటోను షేర్ చేసాడు సూపర్ స్టార్.

అయితే సరిలేరు నాకెవ్వరు సినిమా హిట్ ఆయిన తరువాత మరో సినిమా ఇప్పటి వరకు అనౌన్స్ చేయలేదు మహేష్. అయితే త్వరలోనే పరశురామ్ తో ఒక సినిమా చేయబోతున్నాడట. అయితే మొత్తానికి సూపర్ స్టార్ మహేష్ బాబు అనుకోకుండా వచ్చిన ఈ కరోనా హాలిడేస్ ను బాగానే సద్వినియోగం చేసుకుంటున్నాడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here