Mahesh Master : రాకేష్ మాస్టర్ కోరి్యోగ్రాఫర్ గా ఎన్నో సినిమాలకు పనిచేసారు ఎంతోమంది వర్ధమాన డాన్స్ మాస్టర్స్ శేఖర్, జానీ వంటి వారికీ గురువు. ఇక ప్రభాస్ లాంటి హీరోలకు డాన్స్ శిక్షణ ఇచ్చాడు. అలాంటి రాకేష్ మాస్టర్ తన తుది దశలో అనేక వివాదాలకు కేర్ అఫ్ అయ్యాడు. యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఎంతో మంది సినిమా ఇండస్ట్రీ వాళ్లను విమర్శిస్తూ ఫేమస్ అయ్యారు. అలాగే తన పెళ్లిళ్లతోను ఫేమస్ అయ్యారు. మొదటి భార్య మరణించాక రెండో పెళ్లి చేసుకున్న ఆయన ఆమె విడిగా ఉండటం వల్ల ఒంటరి అయ్యారు. రాకేష్ మాస్టర్ ఎవరి గురించైనా సూటిగా మాట్లాడటం వల్ల శత్రువులు ఎక్కువయ్యారు. అయితే సినిమా ఇండస్ట్రీకి దాదాపు దూరమైన రాకేష్ మాస్టర్ తాజాగా అనారోగ్యం కారణంగా 55 ఏళ్ల వయసులోనే తుది శ్వాస విడిచారు. ఇక ఆయన గురించి ఆయన శిష్యులు ఇంటర్వ్యూలలో మాట్లాడారు.

ముందే చనిపోయినట్లు స్టేటస్ పెట్టారు…
రాకేష్ మాస్టర్ గత కొద్ది రోజులుగా గాంధీ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటుండగా రెండు రోజుల క్రితమే ఆయన మరణించినట్లు కొంతమంది ఇంస్టాగ్రామ్ స్టోరీస్ అలాగే వాట్సాప్ స్టేటస్ లు పెట్టేసారని రాకేష్ మాస్టర్ శిష్యుడు మహేష్ మాస్టర్ తెలిపారు. ఢీ షో సమయంలో మాస్టర్ ఎంతో సహాయం చేశాడని రాకేష్ మాస్టర్ ని గుర్తు చేసుకున్న అతను రెండు రోజుల క్రితం ఆయన బ్రతికే ఉన్నారు, డాక్టర్స్ కూడా పాజిటివ్ గానే ఉన్నారు.

ఆ సమయంలో అలా చనిపోయారని మీ వ్యూస్ కోసం పెట్టుకున్నారు అంటూ ఫైర్ అయ్యారు. వ్యూస్ కోసం పెట్టుకున్నారా లేక మీరే ఆయనను చంపేసారా అంటూ ఎమోషనల్ అయ్యారు మహేష్. ఇటీవలే ఢీ డాన్స్ షో మాస్టర్ చైతన్య మరణించడం ఇక ఇప్పుడు రాకేష్ మాస్టర్ మరణించడం చాలా బాధించిందని, వాళ్ళు లేని లోటు తెలుస్తుందంటూ రాకేష్ మాస్టర్ శిష్యులు బాధపడ్డారు.

































