“ఒరేయ్ నన్నే ఓడిస్తావా…” గౌతమ్ తో… మహేష్ ని ఈ రేంజ్ లో ఎప్పుడు చూసి ఉండరు..

0
255

క్వారంటైన్ టైం మన హీరోలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు కొత్త కొత్త వంటకాలు చేస్తూ కాలం గడుపుతుంటే.. మరికొందరు ఫ్యామిలీతో ఈ అనుకోని హాలిడే సమయాన్ని గడిపేస్తున్నారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ క్వారంటైన్ సమయాన్ని మొత్తం ఫ్యామిలీతో గడిపేస్తున్నాడు. కొడుకు, కూతురుతో రచ్చ రచ్చ చేస్తున్నాడు. అనుకోకుండా దొరికిన ఈ సమయాన్ని పిల్లలతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు. ఇప్పటి వరకు మిస్ అయిన టైంని ఇప్పుడు వాడేస్తున్నాడు. ఇందుకోసం మహేష్ ఈ టైం ఎలా గడపాలి అని ఒక టైం టేబుల్ కూడా పెట్టుకున్నాడట. తాజాగా ఆన్లైన్ లో కొడుకు గౌతమ్ తో కలిసి టెన్నిస్ గేమ్ ఆడుతున్నాడు.

ఆ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నాడు సూపర్ స్టార్. రెగ్యులర్ షూటింగ్స్ సమయంలో పిల్లలతో ఆడుకునే సమయం దొరకదు. అందుకే ఇప్పుడు కరోనా తీసుకొచ్చిన అనుకోని హాలిడేస్ ను పిల్లలు గౌతమ్, సితారలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. “మరో రోజుకూడా పిల్లలతో ఇలా గడిచిపోయింది…” అంటూ ట్వీట్ చేసాడు మహేష్. మరోవైపు ఇప్పటి వరకు చూడని సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇలా ఏవి వదలకుండా చూసేస్తున్నాడట.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here