సంక్రాంతికి విడుదలైన “సరిలేరు నీకెవ్వరు” సినిమాతో టాలీవుడ్ లో భారీ విజయాన్ని అందుకున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఆ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ కలెక్షన్లు కొల్లగొట్టింది. తన ప్రతి సినిమాని మొదటి నుండి షూటింగ్ తరువాత వచ్చే ప్రమోషన్ల వరకు దగ్గరుండి చూసుకునే మహేష్. ప్రమోషన్స్ అయిపోయిన తరువాత ఫామిలీ తో కలిసి విదేశాలకు విహార యాత్రలకు వెళ్లి వస్తుంటారు. అలాగే విదేశాలకు వెళ్లిన మహేష్ ఈ మధ్యనే ఇండియా తిరిగి వచ్చారు. ఇండియా వచ్చిన తరువాత ఒక ఆంగ్ల పత్రిక ఆయనను ఇంటర్వూ చేసింది. ఆ ఇంటర్వూలో చాలా ఆసక్తికర విషయాలను వెల్లడించారు సూపర్ స్టార్ మహేష్ బాబు.
మీరు ఒక్కరోజు ముఖ్యమంత్రి అయితే మొట్టమొదట ఈ పని చేస్తారు అని అడగగా.. మహేష్ “నాకు తెలియదు.. రాజకీయాలపై పెద్దగా అవగాహనా లేదు.. ఒకవేళ నేను ముఖ్యమంత్రి అయితే మాత్రం రాష్ట్రాన్ని దేవుడే కాపాడాలి” అని ఫన్నీగా వ్యాఖ్యానించారు. అయితే మహేష్ ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఉద్దేశించి అలా కామెంట్ చేసాడని కొంత మంది వ్యాఖ్యానిస్తున్నారు.
ప్రస్తుతం మహేష్, వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో సినిమా షూటింగ్ త్వరలో మొదలు పెట్టబోతున్నాడు. ఈ సినిమా కోసం ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ అంటా రెడీ చేసాడట వంశి. “మహర్షి” చిత్రం తరువాత వంశి, మహేష్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం కావడంతో అభిమానుల్లో ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.




























