Major Cinema : విభిన్న కథలతో ప్రయోగాలు చేస్తూ గుర్తింపు తెచ్చుకున్న అడవి శేష్, తాజాగా మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ జీవిత కథ ఆధారంగా తీసిన చిత్రం మేజర్. ఈ సినిమా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. పాన్ ఇండియా సినిమాగా విడుదల అవుతున్న ఈ సినిమా కోసం అడవి శేష్ ఎప్పుడు లేనంతగా అన్ని చోట్లకు తిరుగుతూ ప్రచారం చేస్తున్నాడు. ఎలాగైనా ఈ సినిమాను ప్రేక్షకులకు దగ్గర చేయాలని భావిస్తున్నారు.

టికెట్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం…..

ఇక ఇండియా మొత్తం చుట్టేస్తూ ప్రచారం చేస్తున్న మేజర్ టీం ఇక మరో నిర్ణయంతో అందరిని ఆకర్షించారు. తెలుగు రాష్ట్రాలలో థియేటర్లలో టికెట్ రేట్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల వివాదం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని మలుపులు తిరిగిందో అందరికి తెలిసిన విషయమే. ఇక టికెట్ రేట్లను పెంచుకునే వెసులుబాటు కల్పించాలని ఏపీ సీఎంని పలువురు సినీ తారలు స్వయంగా వచ్చి కలిశారు. ఇక టికెట్ రేట్లను పెంచడంతో పెద్ద సినిమాలకు కూడా డిబేట్ పడింది. సినిమా బాగుంటే ఒక వారం ఆడుతుందేమో కానీ ఇక సినిమా మీద టాక్ లేకపోతే మొదటి వారం కలెక్షన్స్ కూడా గోవింద అంటాయి. ఈ విషయం ఆచార్య సినిమాతో రుజువైంది. అందుకే మేజర్ సినిమా యూనిట్ జాగ్రత్త పడుతున్నారు.
#MajorTheFilm MANA cinema. So, we decided to give you the LOWEST PRICES for ANY film post pandemic. https://t.co/aAUhmKEO9u
— Adivi Sesh (@AdiviSesh) May 27, 2022
Sharing my love ❤️ Sharing my heart. pic.twitter.com/wWPHLD4GOK
తెలంగాణ సింగల్ స్క్రీన్ లో 150 రూపాయలు, మల్టీ ప్లెక్స్ లో 195 రూపాయలుగా టికెట్ రేట్ నిర్ణయించారు . అదే విధంగా ఆంధ్ర ప్రదేశ్ లో 147 రూపాయలు సింగిల్ స్క్రీన్ కి, 177 రూపాయలు మల్టీప్లెక్స్ రేట్స్ ఫిక్స్ చేసారు . ఈ విషయాన్ని మేజర్ టీమ్ పేర్కోంటూ కరోనా పాండెమిక్ తర్వాత అత్యంత తక్కువ ధరలతో మేజర్ విడుదలవుతోందని సోషల్ మీడియాలో ద్వారా ప్రకటించారు. ఇక మేజర్ సినిమా జూన్ 3న విడుదలవుతోంది. అడవి శేష్ సరసన సయి మంజ్రేకర్ హీరోయిన్ గా ప్రకాశం రాజ్, శోభిత ధూళిపాళ్ళ, రేవతి ప్రధానపాత్రాలలో నటించారు.


































