Makeup Man Chandra : 1976లో ఒక సాధారణ మేకప్ అసిస్టెంట్ గా పని మొదలు పెట్టి దాదాపు నలభై ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ లెజెండ్రీ నటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లకు పనిచేసిన బొమ్మదేవర చంద్ర గారు దాదాపు ముప్పై ఏళ్ళు నాగార్జున దగ్గర మేకప్ మాన్ గా పనిచేసారు. నాగార్జున వెంటే ఎప్పుడూ ఉండే చంద్ర గారు ప్రస్తుతం ఆయన దగ్గర నుండి బయటకు వచ్చేసారు. అక్కినేని కుటుంబంతో ఎంతో అనుబంధం ఉన్న చంద్ర గారు అలా చెప్పకుండా అక్కినేని కాంపౌండ్ లో నుండి బయటకు రావడానికి గల కారణాలను రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో వివరించారు.

నాగార్జున కి కూడా కారణం తెలియదు…
చంద్ర గారు మొదట పని తెలియకపోయినా చేసిన పని ఎన్టీఆర్ గారికి ‘దాన వీర శురా కర్ణ’ షూటింగ్ లో ఎన్టీఆర్ గారికి మేకప్ చేయడానికి సహాయం చేయడం. ఆ తరువాత నాగేశ్వరావు గారికి ‘చాణక్య చంద్రగుప్త’ లో మేకప్ కి అసిస్టెంట్ గా అలా పౌరాణిక సినిమాలు దాదాపు ఐదు పనిచేయడంతో కెరీర్ మొదట్లోనే ఎంతో అనుభవం వచ్చింది. ఇక అక్కినేని కాంపౌండ్ లో స్థిరపడ్డాక నాగార్జున కు మేకప్ మాన్ గా పనిచేస్తూ అలా ఎపుడూ ఆయనతో ఉండి సమయం ఎక్కువ ఆయనతో గడపడం వల్ల పని అయ్యాక ఇంటికి వెళ్లినా నాగార్జున గారి గురించి, పని గురించి ఆలోచించడం ఎక్కువైందట.

ఒకసారి తన తల్లికి ఆరోగ్యం సరిగా లేదని చూపించదానికి డాక్టర్ వద్దకు వెళితే అక్కడ ఈయన సమస్య ప్రస్తావించగా నువ్వు ఆ పని నుండి బయటకు రావాలి లేదంటే ప్రమాదం అని చెప్పారట. నిరంతరం అక్కడే పనిచేయడం వల్ల ఆ ఆలోచనలతో నీ మైండ్ ఉండిపోయింది, ఇతరులు ఏం చెప్పినా వినే పరిస్థితిలో ఉండవు అంటూ చెప్పడంతో ఇక పని మానేసి బయటకు వచ్చేసారట చంద్ర. అయితే అక్కినేని ఫ్యామిలీలో అందరూ బాగా చూసుకున్నారని, ఇంటి సభ్యుడిగానే చూస్తారంటూ కానీ ఎందుకు పని మానేస్తున్నానో నాగార్జున గారికి కూడా చెప్పకుండా బయటికి వచ్చేసానని చెప్పారు.



























