Makeup man Madhava Rao : నవంబర్ 15 న ఆర్గన్ ఫెయిల్యూర్ తో సూపర్ స్టార్ కృష్ణ గారు మరణించారు. ఆంధ్ర జేమ్స్ బాండ్ గా పేరు తెచ్చుకున్న కృష్ణ గారు టాలీవుడ్ కి కొత్త ట్రెండ్ ను తీసుకురావడంలో ముందున్నారు. ఆయన సినిమాలను చేసి డబ్బు సంపాదించడం కంటే అభిమానులను సంపాదించుకున్నారు. ఒక్కసారి కృష్ణ అభిమానిగా మారిన వాళ్ళు జీవితాంతం ఆయన అభిమసనిగా ఉంటారు అంటూ కృష్ణ గారు చెప్పిన మాటలు అక్షర సత్యంగా ఆయన అంతిమ యాత్రకు వేలాది మంది తరలిరావడం చూసాం. ఎక్కడినుండో కుటుంబాలు కుటుంబాలు ఆయనను కడసారి చూడటానికి వస్తారని ఎవరూ అంచనా వేయలేదు. ఇక ఆయన గురించి ఆయన వ్యక్తిగతంగా ఎలాంటి వ్యక్తో ఆయనకు మేకప్ మాన్ గా పనిచేసిన మాధవరావు గారు తెలిపారు.

ఇందిరా గారు అలా పిలిచేవారు…
మాధవరావు గారు మొదటి నుండి కృష్ణగారికి మేకప్ మాన్ గా ఉండేవారు. దాదాపు శ్రీ శ్రీ సినిమా వరకు ఆయనే పనిచేసారు. మాధవరావు గారు కృష్ణ, విజయనిర్మల గారి గురించి మాట్లాడుతూ వారిద్దరూ ఎన్నో దాన ధర్మలను చేశారంటూ చెప్పారు. విజయనిర్మల గారు చనిపోయే ఏడాది ముందు నేను ఇల్లు కొనుక్కోవాలంటే ఇరవైఐదు లక్షలు ఇచ్చారు అప్పుగా తీసుకుని మళ్ళీ ఇచ్చేస్తాసినని చెప్పినా ఏమి వద్దు నువ్వు ఎంత సర్వీస్ చేసుంటావు మాకు అన్నారు వారిద్దరి గొప్పతనం అది. ఇక ఇందిరా దేవి గారు నన్ను అన్నయ్య అని పిలిచేవారు.

నా భార్య ను వదిన అంటూ పిలుస్తారు. ఆప్యాయంగా పలకరిస్తారు ఇందిర గారు అంటూ చెప్పారు. ఇక విజయనిర్మల గారిని పెళ్లి చేసుకున్నప్పుడు ఇందిరా దేవి గారు మొదట్లో కోపంగా ఉన్నా మళ్ళీ సర్దుకుపోయారు. విజయ నిర్మల గారిని పెళ్లి చేసుకున్నాక ఇందిరా గారికి మహేష్, అతని చెల్లెలు పుట్టారు. ఆయన ఇద్దరినీ బాగా చూసుకున్నారు, పిల్లలకి న్యాయం చేసారు. ఇక విజయనిర్మల ను ఇందిరా దేవి గారు కూడా చాలా గౌరవంగానే చూసుకునేవారు అంటూ చెప్పారు.
































