Malaika Arora accident : బాలీవుడ్ నటి మలైకా ఆరోరా కారు ప్రమాదానికి గురయ్యారు. ముంబై శివారులో కారు ప్రమాదానికి గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం మలైకా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌వేలో మూడు వాహనాల మధ్య మలైకా కారు నలిగిపోయిన ఘటనలో ఆమెకు గాయాలయ్యాయి.

ప్రమాదం ఇలా జరిగింది …..
ప్రమాదంపై ఖొపోలీ పోలీస్ స్టేషన్ అధికారులు చెప్పిన వివరాల ప్రకారం ..
శనివారం మధ్యాహ్నం ఓ ఫ్యాషన్ ఈవెంట్ ముగించుకుని ఇంటికి బయలుదేరిన మలైకా కారు ముంబై-పూణే ఎక్స్‌ప్రెస్‌వే లో , 38వకిమీ పాయింట్ వద్ద ప్రమాదానికి గురైంది . హైవేపై మూడు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి ,మలైకా కారు రెండు కార్ల మధ్యలో ఉండటం తో నలిగి పోయి మలైకా కు దెబ్బలు తగిలాయి. కార్లన్నీ దెబ్బతిన్నాయి. ప్రమాదం తర్వాత మిగతా వాహనాలు వెళ్లిపోగా, గాయపడ్డ మలైకను సిబ్బంది ఆస్పత్రికి తరలించారు. అయితే ఈరోజు ఆమె ఆరోగ్యం బాగానే ఉండటంతో ఈరోజు ఉదయం డిశ్చార్జ్ చేసారు.































