సినీరంగ ప్రముఖులు నలుగురికీ ఆదర్శంగా వుండాలంటారు. కానీ అందుకు విరుద్ధంగా ఆదర్శంగా వుండవల్సిన స్టార్ హీరోలే తప్పుడు పనులకు పాల్పడితే.. ఆ చేష్టలనే ఆదర్శంగా తీసుకుని నవతరం నాశనమైతే ఎవరు బాధ్యత వహిస్తారు.?

మలయాళ హీరో దుల్కార్ సల్మాన్.. ఆయన కొలీగ్ పృథ్వీరాజ్ లు అలాంటి తప్పుడు పనులను చేసే దొరికిపోయారు. ప్రస్తుతం వీళ్ళద్దరిపైనా కేరళ ఆర్టీఏ కేసులు బుక్ చేసేందుకు సిద్ధమౌవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. దుల్కార్ సల్మాన్, పృథ్వీరాజ్ ఇద్దరూ రేసింగ్ మత్తులో మునిగితేలారని కొట్టాయం – కొచ్చి రహదారిలో కార్ రేసింగుకి వెళ్లారనే సాక్ష్యం లభించడంతో ఇద్దరిపైనా దర్యాప్తు జరుగుతుంది. సోషల్ మీడియాల్లో లభించిన ఒక వీడియో ఫుటేజ్ ఆధారంగా ఈ కేసును ఆర్టీఏ వాళ్లు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ వీడియోని ఆ ఇద్దరి స్టార్ హీరోల కార్లను వెంబడించిన ఇద్దరు కుర్రాళ్లు అప్ లోడ్ చేయడంతో ఆ వీడియో కాస్తా సోషల్ మీడియాలో బాగా వైరలైంది.
ప్రస్తుతం ఈ కేసును ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని తప్పు చేసినట్లుగా ఋజువైతే ఆ ఇద్దరు హీరోలకు నోటీసులు పంపిస్తామని ఆర్టీఏ వాళ్లు స్ట్రాంగ్ గానే చెబుతున్నారు. వీళ్లు దోషులని తేలితే సెక్షన్ 184 ప్రకారం కారు ఓనర్స్ అయిన వీళ్ళిద్దరికీ పెనాల్టీ విధిస్తారు. అది చెల్లించకపోతే 6 నెలలు జైలుకు పంపిస్తారు. గతంలో కూడా స్టార్ హీరో, మరియు డైరెక్టర్ పృథ్వీ రాజ్ మరొక చెత్త పని చేసి దొరికిపోయాడు. 2019 నవంబర్ లో పృథ్వీరాజ్ కొత్త లగ్జరీ కారు విలువ తగ్గించి పన్ను ఎగ్గొట్టాలని చూడడంతో ఎర్నాకులం ఆర్టీఏ రిజిస్టేషన్ ని నిరాకరించింది. దరఖాస్తులో చూపించిన కొనుగోలు బిల్లులో లగ్జరీ కారు విలువ రూ .1.34 కోట్లుగా ఉండగా. అసలు కారు విలువ సుమారు రూ .1.64 కోట్లు అని అధికారులు గుర్తించడం ఆసక్తికరమైన విషయం.




























