మగవారిని వేధించే సమస్యలలో అతి పెద్ద సమస్య బట్టతల ఏర్పడడం. అతి చిన్న వయసు కలిగిన వారిలో ఈ సమస్య ఎక్కువగా పట్టిపీడిస్తోంది. అధిక మొత్తంలో జుట్టు ఊడిపోవటం వల్ల జుట్టు పెరగడం కోసం ఎక్కువ శ్రద్ధను అబ్బాయిలు తీసుకుంటున్నారు. కొన్నిసార్లయితే బట్టతల కేవలం మగవారికి ఎందుకు వస్తుంది? ఆడవాళ్లకు రాదా? అనే అనుమానం కూడా వారిలో కలుగుతుంది. కానీ బట్టతల ఎక్కువగా మగవారిలో ఎందుకు వస్తుంది. మహిళల్లో ఎందుకు రాదు అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం…

మగవారిలో లైంగిక హార్మోన్ అయిన టెస్టోస్టిరాన్ హార్మోన్ నుంచి డీహైడ్రో టెస్టోస్టిరాన్ ఎక్కువగా ఉత్పత్తి కావడం ఇందుకు కారణమని చెప్పవచ్చు. ఈ డీహైడ్రో టెస్టోస్టిరాన్ హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవడం వల్ల మగవారి జుట్టు పొడవుగా పెరగదు. జుట్టు పొడవుగా పెరగకపోవడం వల్ల వారిలో జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటుంది. అంతేకాకుండా పని ఒత్తిడి, మానసిక ఆందోళనలు, వాతావరణంలో ఏర్పడే కాలుష్యం వల్ల కూడా అధికంగా జుట్టు రాలి బట్టతల ఏర్పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఆడవారిలో ఇలాంటి హార్మోన్లు చాలా తక్కువగా ఉత్పత్తి కావడం వల్ల వారిలో జుట్టు ఊడిపోకుండా ఒత్తుగా పెరుగుతుంది. మహిళలలో కూడా ప్రసవం తర్వాత వారి శరీరంలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడటంవల్ల అధికంగా జుట్టు రాలే సమస్యను ఎదుర్కొంటారు. అంతేకాకుండా మగవారిలో అయినా, స్త్రీలలో అయినా దీర్ఘకాలిక సమస్యలతో బాధపడే వారికి జుట్టు రాలే సమస్య అధికంగా ఉంటుంది. అలాగే మన శరీరంలో ఐరన్ జింక్ వంటి పోషకాలు లోపం వల్ల అధికంగా జుట్టు రాలే సమస్య ఉంటుంది. మరికొందరిలో బట్టతల ఏర్పడడం ఆనేది జన్యు పరమైన లోపాల వల్ల ఇలాంటి సమస్యలు ఏర్పడుతుంటాయి.అయితే పురుషులలో ముందు భాగం నుంచి ఈ జుట్టు ఊడి పోవడం వల్ల పైన పలుచబడి బట్టతల ఏర్పడటం అనేది సర్వసాధారణమైనని చెప్పవచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here