Mallareddy daughter in law Preethi Reddy : నాకు డైట్ ప్లాన్ ఇదే… ఆడవాళ్లు ఏమి తినాలి ఏమి తినకూడదు…: మల్లారెడ్డి గారి కోడలు ప్రీతిరెడ్డి

0
254

Mallareddy daughter in law Preethi Reddy: తెలంగాణ రాష్ట్ర సమితి ప్రస్తుత బిఆర్ఎస్ పార్టీ నుండి మేడ్చల్ ఎమ్మెల్యేగా ఉన్న మల్లారెడ్డి ఇన్స్టిట్యూషన్స్ అధినేత మల్లారెడ్డి గారి గురించి పరిచయం అక్కర్లేదు. రాజకీయాల గురించి అవగాహన ఉన్న వారికి ఆయన తెలుసు. పాలు అమ్మి జీవితం మొదలు పెట్టిన ఆయన నేడు రాజకీయవేత్తగా అలాగే విద్యావేత్తగా సక్సెస్ ఫుల్గా కెరీర్ లో ఉన్నారు. ఇక ఆయన కోడలు మల్లారెడ్డి గ్రూప్ అఫ్ ఇస్టిట్యూషన్స్ ఎండి అలాగే మల్లారెడ్డి సైన్స్ సిటీ చైర్మన్ ప్రీతిరెడ్డి తొలిసారి ఇంటర్వ్యూలో పలు అంశాల మీద మాట్లాడారు.

నా హెల్త్ డైట్ ఏంటంటే…

ప్రీతీ గారు నాట్యకారిణిగా అలాగే మోటివేషనల్ స్పీకర్ గా ఉంటూనే మల్లారెడ్డి గ్రూప్ అఫ్ ఇన్స్టిట్యూషన్స్ అన్నింటి బాధ్యతలు చూస్తున్నారు. అవికాక హాస్పిటల్స్ ను చూసుకుంటున్నారు. ఇలా ఇన్ని పనులను ఒక రోజులో చేస్తున్నా హెల్తీగా ఫిట్ గా ఉండటానికి కారణం ఏమిటి అనే విషయాన్ని ఆమె డైట్ సీక్రెట్ ను వివరించారు. యోగా సాధన ఆరోగ్యానికి మంచిదంటూ ప్రీతిరెడ్డి చెబుతున్నారు. మూడేళ్ళ క్రితం వరకు పని చేసి సాయంత్రం ఇంటికి వచ్చాక అలసట ఉండేదని తిండి మీద పెద్దగా ధ్యాస ఉండేది కాదని ప్రీతి గారు తెలిపారు. అలాంటి సమయంలో ఒక మంచి యోగా ట్రైనర్ ద్వారా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలా ఒత్తిడి తగ్గించుకోవాలి వంటి అంశాల మీద అవగాహన పెంచుకోవడం వల్ల చాలా మార్పులు చూసానంటూ ప్రీతి చెబుతున్నారు.

ముఖ్యంగా ఆడవాళ్లు తగినన్ని పోషక పదార్థాలు తీసుకోవాలని సూచించారు. పిల్లలకు భర్తకు ఫ్రెష్ గా వండినవి పెట్టి చద్ది కూరలు నేను తిందాం అనుకునే ధోరణి మారాలి. రోజూ కొన్ని గుడ్లు డకబెట్టుకుని లేక ఆమ్లెట్ లాగా వేసుకుని తినాలి. అలాగే పాలు ఒక గ్లాస్ తాగాలి. అన్నం తగ్గించి కూరలు ఎక్కువగా తినాలి, ఇక నాలా శాఖహరులైతే కూరగాయలు అలాగే పన్నీర్ లాంటివి ఎక్కువ తీసుకోవాలి. ప్రోటీన్స్ షేక్స్ ఇపుడు మార్కెట్ లో అందుబాటులో ఉంటున్నాయి. సహజమైన ప్రోటీన్స్ షేక్స్ ని రోజు తీసుకోవడజం మంచిది. అవి నాకు డైట్ లో భాగంగా చేసుకున్నప్పటి నుండి ఎంత పనిచేసినా అలసట ఉండదు అంటూ ఆరోగ్యంగా ఉండటం కూడా ముఖ్యం ఆడవాళ్లు అంటూ చెప్పారు ప్రీతిరెడ్డి.