Mallareddy Daughter-in-law Preethireddy : మావయ్య మల్లారెడ్డిగారి సక్సెస్ సీక్రెట్ అదే… ఏ రోజూ రెస్టారెంట్ కి కూడా వెళ్ళలేదు కారణం ఏంటంటే…: మల్లారెడ్డి గారి కోడలు ప్రీతిరెడ్డి

0
438

Mallareddy Daughter-in-law Preethireddy: పాలమ్మిన కష్టపడినా, పూలమ్మిన కష్టపడినా ఆ తరువాత బిజినెస్ చేసినా అంటూ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా వైరల్ అయిన మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు అలాగే తెలంగాణ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అయన స్వయంకృషితో ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇక్కడిదాకా వచ్చారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయ నాయకులలో ప్రముఖులలో ఒకరిగా ఉన్న ఆయన సక్సెస్ సీక్రెట్స్ గురించి ఆయన కోడలు మల్లారెడ్డి గ్రూప్ అఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఎండి ప్రీతిరెడ్డి తాజాగా ఇక ఇంటర్వ్యూలో పాల్గొని వివరించారు.

అదే ఆయన సక్సెస్ కు కారణం…

మల్లారెడ్డి గారు ఒక్కోమెట్టు ఎదుగుతూ పాలమ్మిన దగ్గర నుండి నేడు విద్యాసంస్థల అధినేతగా ఎదిగిన వైనం అందరికీ ఆదర్శం. ఈ విషయం గురించి ఆయన కోడలు మాట్లాడుతూ ఆయన నిరంతరం కస్టపడుతూనే ఉంటారు. ఇంట్లో ఉన్నా బయట ఉన్నా ఆయన విద్యాసంస్థలు అలాగే హాస్పిటల్స్ గురించి ఆలోచిస్తుంటారు. విరామం ఎక్కడా తీసుకోరు అంటూ తెలిపారు. ఆయన హాలిడేస్ అని తీసుకున్న రోజులు చాలా అరుదు. ఒకటి రెండు సార్లు అమెరికా వెళ్లారేమో, అక్కడికి వెళ్లి ఉంద్యం ఉదయం రాత్రి కాల్స్ చేస్తారు మాకు అన్ని విషయాలు వాకబు చేస్తూనే ఉంటారు. చివరికి కోవిడ్ సమయంలో ఆయన కరోనాతో హాస్పిటల్ లో ఉన్నపుడు కూడా ఫోన్ చేసి హాస్పిటల్స్ లో పరిస్థితి ఎలా ఉంది అంటూ ఆరా తీసేవారు.

ఒక్కరోజు కూడా ఆయన తీరికగా ఉండరు, కష్టపడుతూనే ఉంటారు అదే ఆయన సక్సెస్ సీక్రెట్ అంటూ ఆయన కోడలు ప్రీతిరెడ్డి తెలిపారు. ఇక తన అత్తమ్మ మావయ్య పడిన కష్టాల గురించి ఈ స్థాయికి రావడానికి వాళ్ళు పడిన ఇబ్బందులను చెబుతూనే ఉంటారు. విద్యాసంస్థలను పెట్టేవరకు కూడా కొంచం డబ్బు చేతికి వచ్చినా దానిని నెక్స్ట్ చేసే బిజినెస్ కోసం అన్నట్లు పెట్టుకునేవాళ్ళే కానీ ఒక రెస్టారెంట్ కి వెళ్లి తినాలి లేదా ఎక్కడికైనా హాలిడేకి వెళ్ళాలి లేదా ఏవైనా నగలు చేయించుకోవాలి లాంటి ఆలోచనలు చేసేవారు కాదు అంటూ ప్రీతి తెలిపారు. ఖర్చుచేసే కంటే ఆ డబ్బును వ్యాపారంలో ఉపయోగించాలని ఆలోచించేవారు అత్తామామలు అంటూ ప్రీతి తెలిపారు.