హైదరాబాద్, గోకుల్ థియేటర్ లో సినిమా హాయిగా సినిమా చూడడానికి వచ్చిన వ్యక్తి హఠాత్తుగా చనిపోవడం థియేటర్లో కాసేపు ఉద్రిక్తత చెలరేగింది. చనిపోయిన వ్యక్తి ఎవరనేది గుర్తించడానికి తగిన ఆధారాలు ఏమి లభించక పోవడంతో అనుమాస్పద మృతిగా కేసు నమోదు చేసారు పోలీసులు. శుక్రవారం జరిగిన ఈ ఘటనతో గోకుల్ థియేటర్ లో ప్రదర్శిస్తున్న “జాను” సినిమాకు కాసేపు నిలిపివేశారు.

వివరాల్లోకి వెళితే ఎర్రగడ్డ లోని గోకుల్ థియేటర్ లో శుక్రవారం నుంచి సమంత, శర్వానంద్ నటించిన “జాను” సినిమా పదర్శితమవుతుంది. అందరిలానే సినిమా చూడడానికి వచ్చాడు ఒక వ్యక్తి. సినిమా అయిపోయాక అందరూ వెళ్లిపోయారు. కానీ ఒక వ్యక్తి సీట్ లోనుంచి కదలకుండా అలానే కూర్చుని ఉన్నాడు. అదే సమయంలో తరువాతి షో కోసం థియేటర్ శుబ్రపరిచే సిబ్బంది. ఆ వ్యక్తిని గమనించి దూరం నుంచే గట్టిగా అరిచారు. ఎంతగా అరుస్తున్న ఆ వ్యక్తి కదలక పోవడంతో నిద్రపోతున్నాడేమో అని లేపేందుకు దగ్గరకి వెళ్లిన గోకుల్ థియేటర్ సిబ్బంది అతన్ని లేపడానికి ప్రయత్నించారు. ఎంత లేపినా అతని నుండి స్పందన రాలేదు. అప్పటికే ఆటను మరణించాడని గుర్తించిన సిబ్బంది పోలైసులకు పిర్యాదు చేయడంతో హుటాహుటిన పోలీసులు వెళ్లి, మృతి చెందిన వ్యక్తి ని పరీక్షించి మృతదేహాన్ని స్వాదీనం చేసుకుని గాంధీ ఆసుపత్రి మార్చురీ కి పంపించారు.

అయితే చనిపోయిన వ్యక్తి ఎవరు అని గుర్తించడానికి ప్రత్నించిన పోలీసులకు అతని జేబులు తనికీ చేసినా కూడా స్పష్టమైన ఆధారాలు ఏమి లభించకపోవడంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్నారు. అతడు ఎలా చనిపోయాడు? గుండెపోటుతో చనిపోయాడా లేక మరేదైనా కారణం ఉందా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయని చెబుతున్నారు పోలీసులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here