కన్న తండ్రే క్రూరమృగమై వేటాడాడు… కన్న కూతురు అని కూడా చూడకుండా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. మద్యానికి బానిసై కోరిక తీర్చమని కన్న కూతురినే వేధించాడు. ఆమెను చిత్ర హింసలకు గురిచేశాడు. రోజు రోజుకు వేధింపులు ఎక్కువవుతుండటంతో తల్లికి చెప్పింది బాధితురాలు. భీమవరంలోని 10వ వార్డులో జరిగిన ఈ ఘటన తీవ్ర కలలం రేపింది.

లక్ష్మీనారాయణ అనే వ్యక్తి భీమవరంలో తాపీపనులు చేస్తూ అక్కడే నివాసం సాగిస్తున్నాడు. అతని భార్య కూడా కూలిపనులు చేసుకుంటూ ఉంటుంది. వీరికి నాలుగు కూతుర్లు ఉన్నారు. ఈ మధ్యనే పెద్దమ్మాయికి పెళ్లి చేసారు.. మిగిలిన ముగ్గురు అమ్మాయిలు ఇంటి వద్దనే ఉంటున్నారు. అయితే మద్యానికి బానిసైన లక్ష్మీనారాయణ రెండో కూతుర్ని వేధింపులకు గురిచేస్తున్నాడు. మద్యం మత్తులో కోరిక తీర్చమంటూ చిత్రహింసలకు గురిచేశాడు. అయితే భయంతో బాధితురాలు విషయం ఎవరికీ చెప్పలేదు. అయితే మరోసారి తాగి వచ్చి కూతురిని బలవంతం చేయబోయాడు దేనితో ఆమె ఒక్కసారిగా కేకలు వేసి, జరిగిన విషయం తల్లికి చెప్పింది. లక్ష్మినారాయణ అక్కడనుంచి పారిపోయాడు. ఆమె పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసుకుని పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.




























