‘మనసిచ్చి చూడు’ సీరియల్ హీరో ఆదికి స్ఫూర్తినిచ్చిన టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా.?

0
324

టెలివిజన్ ఛానల్స్ లో వస్తున్న సీరియల్స్ కి మంచి డిమాండ్ ఉంటోంది. ‘మనసిచ్చి చూడు’ అంటూ ‘స్టార్‌ మా’లో వచ్చే సీరియల్‌ ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటున్న హీరో ఆది తన అందంతో, నటనతో ఆకట్టుకుంటూ ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల ఆదరణను పొందగలిగాడు. ఇంతిలా ఈ సీరియల్ ద్వారా పాపులరైన ఆది వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూస్తే..

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుయే మన బుల్లితెర నటుడైన ఆది అభిమాన హీరో. ఇరవై ఏళ్ళ క్రితం విడుదలైన ‘కొడుకు దిద్దిన కాపురం’ చిత్రంలో ప్రిన్స్ మహేష్ బాబు యాక్టింగ్ కి స్ఫూర్తి పొందిన ఆది నటనపై తనకున్న ఆసక్తితో చిన్నప్పటి నుంచి డాన్స్ అంటే చాలా ఇష్టం ఏర్పరుచుకున్నాడు. ఆది గుంటూరు జిల్లా తెనాలిలో జన్మించాడు. సత్యనారాయణ, విజయశ్రీలు ఆది తల్లిదండ్రులు. ఆది అసలు పేరు మహేష్ బాబు కాళిదాసు. ఆదికి ఓ అక్క, ఓ అన్నయ్య ఉన్నారు. చేబ్రోలు ఇంజనీరింగ్
కాలేజీలో బీటెక్ పూర్తి చేసాడు ఆది. ఒకప్రక్క చెన్నైలో జాబ్ చేస్తూనే మరోప్రక్కలో నటనలో శిక్షణ పొందాడు. ఆ విధంగా 3 సంవత్సరాల ట్రైనింగ్ పూర్తయిన తర్వాత ఓ తమిళ చిత్రంలో ఆదికి నటించే అవకాశమొచ్చింది.

అయితే అనుకోని ఆవాంతరాల వలన ఆ చిత్రం షూటింగ్ ఆగిపోవడంతో నిరాశకు గురైన ఆది మయన్మార్ వెళ్ళిపోయాడు. అక్కడ కూడా కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో నటించాడు. ఆ తర్వాత ‘కార్బరీ కాదల్’ అనే వెబ్ సిరీస్ లో నటించి ఆ వెబ్ సిరీస్ ద్వారా మంచి గుర్తింపును సంపాదించిన ఆది ‘మనసిచ్చి చూడు’ సీరియల్ ఆడిషన్స్ లో పాల్గొని సెలెక్ట్ అయ్యాడు. తెలుగులో మొదటి సీరియల్ తోనే మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ఆది త్వరలోనే టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇస్తానని స్ట్రాంగ్ గా చెబుతున్నాడు. మరి బుల్లితెరపై పాపులరైన ఆది వెండితెరపై కూడా మంచి హీరోగా నిలబడాలని కోరుకుందాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here