Manchu Lakshmi : మంచు మోహన్ బాబు కూతురిగా మంచు లక్ష్మి అందరికి సుపరిచితురాలే. అమెరికాలో సెటిల్ అయి, అక్కడ కొన్ని వెబ్ సిరీస్ లలో నటించి ఆ తరువాత ఇండియా వచ్చేసి ఇక్కడ తెలుగు సినిమాల్లో నటించి తన టాలెంట్ నిరూపించుకున్న మంచు లక్ష్మి ఆశించినంత విజయాలను అందుకోలేదు. తను మాట్లాడే తెలుగుతో మరింత ఫేమస్ అయింది మంచు లక్ష్మి.

ఒక్కసారిగా ఏడ్చేసిన మంచు లక్ష్మి…
ప్రతిసారి తన మాటలతో ట్రోల్ల్స్ కి ఎక్కువ గురయ్యే మంచు లక్ష్మి ‘లక్ష్మి టాక్ షో’ ,’మేము సైతం’ వంటి టీవీ కార్యక్రమాలు కూడా చేసింది. ఈమధ్య యూట్యూబ్ ఛానల్ పెట్టి ప్రేక్షకులకు మరింత చేరువైన మంచు లక్ష్మి సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గా ఉంటుంది. ఇంస్టాగ్రామ్ లో తనకు సంబంధించిన విషయాలను ఎక్కువగా పంచుకునే మంచు లక్ష్మి తాజాగా తెలంగాణ ప్రభుత్వం ‘మన ఊరు మన బడి’ కార్యక్రమంలో భాగంగా యాదాద్రి భువన గిరి జిల్లా లోని 50 ప్రభుత్వ పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు చెప్పింది. ఇక ఈ విషయాలను పంచుకుంటూ తన కూతురు మళ్ళీ కరోనా లాక్ డౌన్ తరువాత స్కూల్ కి వెళ్తున్న విషయాన్ని ఇంస్టాగ్రామ్ రీల్ ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఒక్కసారిగా తనకు తెలియకుండా ఏడ్చేసింది.

— Hardin (@hardintessa143) July 25, 2022
లాక్ డౌన్ మొదట్లో ఎలా తన కూతురుని హ్యాండిల్ చేయాలి స్కూల్ లేకపోతే అనుకున్నా, నేను ఇంట్లోనే తనకు పాఠాలు చెప్పేదాన్ని. ఇప్పుడు ఇన్ని రోజుల తరువాత తనని స్కూల్ కి వదిలి వస్తుంటే చాలా బాధగా ఉందని ఏడ్చేసింది. ఇది కూడా త్వరలో అలవాటు అవుతుందని చెప్పింది. ఇలా ఎమోషనల్ అయిపోవడంతో నెటిజన్స్ కూడా స్ట్రాంగ్ గా ఉండండి లక్ష్మి అంటూ పాజిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.



























