Manchu Lakshmi: సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి మంచు ఫ్యామిలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు మోహన్ బాబు వారసులుగా ఇండస్ట్రీలో మనోజ్ లక్ష్మీ ప్రసన్న విష్ణు ఇండస్ట్రీలో కొనసాగుతున్న విషయం మనకు తెలిసిందే.అయితే మంచు ఫ్యామిలీలోని ఈ ముగ్గురు పెద్దగా ఇండస్ట్రీలో సక్సెస్ సాధించలేదని చెప్పాలి.
ఇకపోతే కెరియర్ పరంగా ఎలా ఉన్నా వీరు వ్యక్తిగత కారణాల వల్ల మాత్రం తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. గత కొద్దిరోజుల క్రితం మనోజ్ విష్ణు ఏకంగా ఒకరిపై ఒకరు దాడి కూడా చేసుకున్నటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య విభేదాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
అంతేకాకుండా మనోజ్ పెళ్లిలో కూడా విష్ణు చుట్టం చూపుగా వచ్చారు. అయితే ఆల్రెడీ పెళ్లి జరిగి ఒక కుమారుడు ఉన్నటువంటి అమ్మాయి భూమ మౌనికను పెళ్లి చేసుకోవడం విష్ణువుకి ఇష్టం లేకపోవడంతోనే తన తమ్ముడు పెళ్లికి చుట్టం చూపుగా వచ్చారని కూడా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సోషల్ మీడియా వేదికగా మంచు లక్ష్మి అభిమానులతో ముచ్చటించారు.
ఈ క్రమంలోనే ఒక నెటిజన్ ఆమెను ప్రశ్నిస్తూ భూమా మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోవడం విష్ణుకి ఇష్టం లేదు కదా అంటూ ప్రశ్నించారు.మంచు లక్ష్మి అవునని సమాధానం చెప్పడంతో ఒక్కసారిగా ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే మనోజ్ పెళ్లి చేసుకోవడం మంచు విష్ణుకి ఇష్టం లేదంటే వీరిద్దరి మధ్య జరిగినటువంటి గొడవ కూడా నిజమేనని పలువురు ఈ గొడవ గురించి చర్చలు జరుపుతున్నారు.
అద్భుత మంత్ర శక్తులతో, మంత్ర రహస్యాలతో, మంత్ర విశేషాలతో మరీ ముఖ్యంగా మహా బలాలకే మహా బలాన్నిచ్చే పరమాద్భుత నృసింహ…
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…