Manchu Lakshmi : మంచు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లక్ష్మి తన భాష యాసతో మరింత ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా ట్రోలర్స్ కి ఈమె ఏదైనా వేడుకలో మాట్లాడితే పండగే. ప్రస్తుతం టీవీ షోస్ చేయకుండా కేవలం సినిమాలతో బిజీగా ఉన్న లక్ష్మి మంచు రీసెంట్ గా మలయాళం సినిమా మాన్స్టర్ లో లెస్బియన్ లాగా నటించి అందరినీ ఆశ్చర్య పరిచింది. తన నటనతో మల్లు అభిమానులను ఆకట్టుకుంది కానీ తెలుగులో మంచి అవకాశాలు మాత్రం అందుకోలేదు. బాహుబలిలో శివగామి వంటి మంచి పాత్ర వస్తే ప్రభాస్ కి తల్లిగా నేను చేయను అంటూ డ్రాప్ అయిందట. ఇక ఆ తరువాత అక్కకి తెలుగు సినిమాల్లో పెద్దగా ఆఫర్స్ రాలేదు. మనోజ్ రెండో పెళ్లి తరువాత తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చిన మంచు లక్ష్మి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

వాళ్ళ పెళ్లి చేయాలని యదాద్రి లో మొక్కుకున్నా…
మంచు లక్ష్మి సమాజానికి ఏదో ఒకటి చేయాలని అలోచించి పాఠశాలలలో వసతుల ఏర్పాటుకు కృషి చేస్తున్నారు. యాదాద్రి జిల్లాలో పాఠశాలల కోసం పనిచేస్తున్న సమయంలోనే గుడికి వెళ్ళినపుడు మనోజ్ మౌనికల పెళ్లి జరగాలని తండ్రి మోహన్ బాబు వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోవాలని మొక్కుకున్నారట.

స్కూల్ లో అభివృద్ధి పనులను పర్యవేక్షించే సమయంలోనే ఆ పనులు పూర్తయ్యే సరికి వాళ్లిద్దరికీ పెళ్లి అయిపోయింది. మళ్ళీ వాళ్లిద్దరినీ తీసుకెళ్లి యాదాద్రిలో దర్శనం చేసుకున్నాం. వాళ్ళ పెళ్లి చేసింది ఆ లక్ష్మి నరసింహ స్వామి అలాగే వాళ్ళ మధ్య ప్రేమ అంటూ మంచు లక్ష్మి తెలిపారు.
































