తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎంతో పేరు ప్రఖ్యాతలు ఉన్న మంచు కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఎన్నో సినిమాలలో విలక్షణ నటుడిగా, హీరోగా అద్భుతమైన సినిమాలలో నటించి విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు వారసులుగా సినిమా ఇండస్ట్రీలోకి మనోజ్, విష్ణు, లక్ష్మీప్రసన్న అడుగుపెట్టారు.

ప్రస్తుతం మంచు విష్ణు మా అధ్యక్షత పీఠాన్ని దక్కించుకొని మా బాధ్యతలను చేపట్టారు. ఇక మనోజ్, లక్ష్మీ ప్రసన్న పలు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా గత కొద్దిరోజుల నుంచి సోషల్ మీడియాలో మంచు మనోజ్ రెండవ వివాహం చేసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

తాజాగా ఈ విషయంపై మంచు మనోజ్ స్పందిస్తూ తన పెళ్లి గురించి అసలు విషయం బయట పెట్టారు. ఈ క్రమంలోనే మంచు మనోజ్ స్పందిస్తూ తను రెండో పెళ్లి చేసుకోలేదనీ తన రెండవ పెళ్లి గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై తనదైన శైలిలో స్పందిస్తూ చురకలు వేసారు. “దయచేసి నా పెళ్ళికి నన్ను కూడా పిలవండి.. ఇంతకీ ఎవరా బుజ్జి పిల్ల.? తెల్ల పిల్ల ? పెళ్లి ఎక్కడ మీ ఇష్టం రా అంతా మీ ఇష్టం. అంటూ మనోజ్ బ్రహ్మానందం ఫన్నీ ఫోటోను షేర్ చేశారు.
https://t.co/HntEosyeYv please invite me too … where is the wedding and who is that Bujji pilla Thella pilla ?! ???????? me istam ra anthaaa me istam ???? pic.twitter.com/q8nKADpxxf
— Manoj Manchu????????❤️ (@HeroManoj1) October 26, 2021
ఇక తాజగా మంచు మనోజ్ చేసిన ఈ ట్వీట్ తో అయన రెండో పెళ్లిపై వస్తున్న వార్తలు పుకార్లేనని తేలిపోయాయి. ఇక మనోజ్ ప్రస్తుతం “అహం బ్రహ్మశ్మి” సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్ లో వస్తోంది.

































