Manchu Manoj: స్నేహితులకు గ్రాండ్ పార్టీ ఇచ్చిన మంచు మనోజ్.. వైరల్ అవుతున్న ఫోటోలు!

0
29

Manchu Manoj: మంచు వారసుడిగా సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నటువంటి మనోజ్ కు ఎంతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక ఈయన ఇండస్ట్రీలో ఉన్నటువంటి మెగా హీరోలతో ఎంతో చనువుగా స్నేహభావంగా ఉంటారు. ముఖ్యంగా సాయిధరమ్ తేజ్ మంచు మనోజ్ నరేష్ కుమారుడు నవీన్ ముగ్గురు కూడా ఎంతో మంచి స్నేహితులు అనే విషయం మనకు తెలిసిందే.

ఇకపోతే తాజాగా మంచు మనోజ్ స్నేహితులందరూ కలిసి ఒకే చోటే సందడి చేశారు.ఇలా మనోజ్ తన ఇంట్లో తన స్నేహితులకు గ్రాండ్ గా పార్టీ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలోని ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నరేష్ కుమారుడు నవీన్ లో ఓ టాలెంట్ దాగి ఉందని బయటపెట్టారు.

ఇక నవీన్ సాయి ధరమ్ తేజ్ మధ్య ఉన్నటువంటి బాండింగ్ కూడా మనకు తెలిసిందే. సాయిధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైనప్పుడు కూడా తన ఇంటి నుంచే వెళ్లారని నవీన్ ఓ సందర్భంలో తెలియజేశారు. ఇలా మనోజ్ స్నేహితులంతా కలిసి పెద్ద ఎత్తున పార్టీ చేసుకున్నారని తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలను మనోజ్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.

Manchu Manoj: మనోజ్ ఇంట్లో గ్రాండ్ పార్టీ…


మనోజ్ ట్విట్టర్ వేదికగా ఈ ఫోటోలను షేర్ చేస్తూ నా ఇంట్లో ఇలా మా ఫ్రెండ్స్, సోదరులమంతా కలిసి సందడి చేశాం.. నవీన్ వండిన బిర్యానీ అద్భుతంగా ఉంది.. బిర్యానీ టైంస్ రంజిత్ చేసిన బట్టర్ చికెన్ ఇంకా అద్భుతంగా ఉంది.. విరూపాక్ష సినిమాతో హిట్ కొట్టిన మా సాయి ధరమ్ తేజ్ బాబాయ్‌కి కంగ్రాట్స్ అని మనోజ్ ట్వీట్ వేశాడు. ఇలా మనోజ్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.