Manchu mohan Babu : మంచు మోహన్ బాబు విలక్షణ నటుడు అందులో ఎలాంటి సందేహం ఉండదు. కామెడీ విలన్ గా, హీరోగా, విలన్ గా చాలా సినిమాలు చేసిన మోహన్ బాబు డైలాగులకు చాలా మంది అభిమానులున్నారు. డిఫరెంట్ మానరిజంతో టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచిన మోహన్ బాబు ప్రస్తుతం మంచి క్యారెక్టర్స్ దొరికినపుడు సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్యనే ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాతో ప్రేక్షకుల మధ్యకు వచ్చి డిజాస్టర్ ను మూట గట్టుకున్నాడు. ఆయన 71వ జన్మదినం సందర్బంగా మోహన్ బాబు గారు ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన వ్యక్తిగత, అలాగే కెరీర్ కి సంబంధించిన విషయాలను పంచుకున్నారు.

మనోజ్ పెళ్ళిలో ఎమోషనల్ అవ్వడానికి కారణం…
మోహన్ బాబు గారు బోల్డ్ గా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. ఇతరులు హర్ట్ అవుతారు అనేది కూడా లేకుండా నిర్మొహమాటంగా ఉన్నది ఉన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి ఆయన బాధ వచ్చినా కంట్రోల్ కాలేరు. ఆయనకు అత్యంత ఆత్మీయులుగా ఉన్న వాళ్ళు కన్నుమూసినపుడు అలానే స్పందిస్తారు, బోరున ఏడ్చేస్తారు మోహన్ బాబు. ఈ విషయం గురించి ఇంటర్వ్యూలో మనోజ్ పెళ్లి సమయంలో ఎందుకు ఎమోషనల్ అయ్యారు అని అడుగగా అది ఎమోషనల్ అయ్యే సమయమే కదా, అక్కడ నేనేకదు ఎవరు ఉన్నా అలానే ఎమోషనల్ అవుతారు అంటూ తెలిపారు.

ఇక ఆయన అంబరీష్ గారు అలానే కృష్ణ, కృష్ణం రాజు గారు మరణించినపుడు కూడా బోరున ఏడ్చేశారు. దీని గురించి మాట్లాడుతూ మనకు అత్యంత ఆత్మీయులు అని భావించిన వాళ్ళు మరణిస్తే అది సహజం, ఏదో పబ్లిక్ కోసం చనిపోయిన వాళ్లను పరామర్శించడం, దండేశామా వచ్చామా అన్నట్లు నేనుండలేను అంటూ ఆయన అభిప్రాయాలను తెలిపారు మోహన్ బాబు గారు.

































