Manchu Mohan Babu : మంచు మోహన్ బాబు విలక్షణ నటుడు అందులో ఎలాంటి సందేహం ఉండదు. కామెడీ విలన్ గా, హీరోగా, విలన్ గా చాలా సినిమాలు చేసిన మోహన్ బాబు డైలాగులకు చాలా మంది అభిమానులున్నారు. డిఫరెంట్ మానరిజంతో టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచిన మోహన్ బాబు ప్రస్తుతం మంచి క్యారెక్టర్స్ దొరికినపుడు సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్యనే ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాతో ప్రేక్షకుల మధ్యకు వచ్చి డిజాస్టర్ ను మూట గట్టుకున్నాడు. ఆయన 71వ జన్మదినం సందర్బంగా మోహన్ బాబు గారు ఒక యూట్యూబ్ ఛానెల్ కి ఇటీవల ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో ఆయన వ్యక్తిగత, అలాగే కెరీర్ కి సంబంధించిన విషయాలను పంచుకున్నారు.

బాలకృష్ణ అంటే ఇష్టం…
మోహన్ బాబు గారు చాలా బోల్డ్ గా మాట్లాడుతూ కాంట్రవర్సీ కి కేర్ అఫ్ గా నిలుస్తారు. ఇక ఆయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాలకృష్ణ గారు హోస్ట్ చేస్తున్న ఆహా ఒరిజినల్స్ అన్ స్టాపబుల్ షోకి వెళ్లడం మీద స్పందించారు, బాలకృష్ణ కోసం మాత్రమే ఆ షోకి వెళ్లానంటూ చెప్పారు. బాలకృష్ణ ఫోన్ చేసి అడిగేసరికి నో చెప్పలేదు.

అన్న గారి కుటుంబం అన్నా ఆ ఇంటి మనుషులన్నా నాకు చాలా ఇష్టం, గౌరవం. అందులోనూ బాలకృష్ణ అంటే చాలా ఇష్టం. తాను అడిగితే నేను కాదనలేను అందుకే వెళ్ళాను. ఇక తాను హోస్ట్ గా చాలా బాగా చేస్తున్నాడు. తనలో ఉన్న సరికొత్త కోణాన్ని అందరికీ చూపిస్తున్నాడు అంటూ చెప్పారు.































