Manchu Vishnu : మంచు మోహన్ బాబు తనయుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టిన మంచు విష్ణు హీరోగా కొన్ని సినిమాలు సక్సెస్ అయినా హీరోగా అంతగా రానించలేదు. ఇక ఈ మధ్య బాగా గ్యాప్ కూడా తీసుకున్న విష్ణు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కి సంబంధిచిన ఎలక్షన్స్ లో పాల్గొని అధ్యక్షుడు అయి మరోసారి ఫామ్ లోకి వచ్చాడు. అయితే మా ఎలక్షన్స్ ఎప్పడు జరిగినట్లుగా కాకుండా జనరల్ ఎలక్షన్ జరిగినంత ఉత్కంఠ భరీతంగా జరిగాయి. ఒకవైపు ప్రకాష్ రాజ్, విష్ణు పోటాపోటీ అన్నట్టు జరిగిన ఎలక్షన్ లో విష్ణు గెలిచి మా అధ్యక్షుడు అయ్యాడు. ఇక ఈ ఎన్నికల సందర్బంగా జరిగిన ఇంటర్వ్యూ ల్లో మంచు విష్ణు చేసిన వాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి అయినా మా నాన్న తరువాతే…
ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్ తరుపున మెగాస్టార్ ఫ్యామిలీ సపోర్ట్ ఇచ్చింది. ఇక ఈ మ్యాటర్ లో మోహన్ బాబు గారు మాట్లాడుతూ అక్కడ ప్రకాష్ రాజ్ గారు కాకుండా చిరంజీవి ఇంట్లో ఇంకెవరైనా నిలబడి ఉంటే ఎలక్షన్ లో నేను ఏకగ్రీవానికి ఒప్పుకునే వాడిని అంటూ మాట్లాడారు. ఇక విష్ణు వీటి గురించి మాట్లాడుతూ నేను మా అధ్యక్ష ఎన్నికల్లో నిలబడాలన్న ఆలోచన అసలు లేదు అయితే ఇండస్ట్రీ లో కొంతమంది పెద్దలు వచ్చి అడిగారు. నేను నాన్న ని సంప్రదిస్తే ఎందుకు ఇపుడు అని అన్నారు. ఆ తరువాత నీ ఇష్టం పోటీ చేయాలని అనుకుంటే చెయ్యి అన్నారు.

అలా నేను దిగాను ఎలక్షన్ లోకి, ఒకవేళ నాన్న వద్దు అనుంటే నాకు ఇష్టమైనా వదులుకునేవాడిని అంతే కానీ చిరంజీవి అయన వెనుక ఉన్నా ఆ దేవుడు ఆయన వెనుక ఉన్నా నేను తగ్గను.. నాకు అందరి కంటే ముందు మా నాన్న ఆయన మాట ఖచ్చితంగా పాటిస్తాను అంటూ చెప్పాడు. ఇక రాజకీయాల్లోకి వెళ్లాలన్న ఆలోచనతో విష్ణు మా ఎలక్షన్స్ లో పోటీ చేసాడు అన్న కామెంట్స్ కి స్పందిస్తూ నాకు రాజకీయాల్లోకి వెళ్లాలని ఉంటే నేను ఎప్పుడో వెళ్ళేవాడిని మా నాన్న రాజ్యసభ మాజీ మెంబెర్, ఇపుడున్న ఏపీ సీఎం మా బావ, ఇక ఇక్కడున్న తెలంగాణ మినిస్టర్ కేటీఆర్ తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అలా ఇంత బ్యాక్ గ్రౌండ్ పెట్టుకుని నేను మా ఎలక్షన్ ను నా రాజకీయ అరంగేట్రానికి వాడుకుంటానని అనుకోవడం వాళ్ల మూర్ఖత్వం అంటూ చెప్పారు. ఇప్పుడు ఈ మాటలు బాగా వైరల్ అవుతున్నాయి.

































