Manchu Vishnu : మా అధ్యక్షుడు అయ్యాక మంచు విష్ణు నటించిన ‘జిన్నా’ సినిమా విడుదల అయింది. ఇక ఇప్పటికీ విడుదల అయిన పాటలు బాగానే హిట్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రమోషన్స్ లో భాగంగా మంచు విష్ణు సినిమా గురించి మాట్లాడుతూ కమెడియన్ వెన్నెల కిషోర్ ను బాగా కామెంట్స్ చేశారు. తనకు పొగరు, తాను ఆరోగంట్ అంటూ మాట్లాడారు. ఇక మన సోషల్ మీడియా బాబులకు ఇలాంటి కంటెంట్ దొరికితే చాలు ఇక ట్రోల్ల్స్ కి పండగే కదా. ఇక మంచు విష్ణు వెన్నల కిషోర్ ను అన్న మాటలను తెగ ట్రోల్స్ చేసేసారు. ఇక వీటిపై మంచు విష్ణు స్పందించారు.

వాడు నాకు చాలా క్లోజ్ అలాంటి ట్రోల్స్ నేను పట్టించుకోను…
జిన్నా సినిమా ప్రొమోషన్స్ లో పాల్గొంటున్న మంచు విష్ణు కి వెన్నెల కిషోర్ ను కామెంట్స్ చేసిన ఇష్యూ మీద ప్రశ్న ఎదురైంది. ఇక ఈ విషయం గురించి మాట్లాడుతూ మంచు విష్ణు నేను ట్రోల్స్ ఇలాంటివి పెద్దగా పట్టించుకోను అంటూ చెప్పారు. వెన్నెల కిషోర్ నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్ అంటూ చెప్పారు. ఇప్పటికీ చెబుతాను వాడు చాలా ఆరోగంట్, గర్వం అది తాను గొప్ప నటుడు కాబట్టి ఉంటుంది.

నిజంగానే తను మంచి నటుడు. తాను వేసే కౌంటర్ లకు సమాధానం చెప్పలేము. నన్ను నోరు తెరవనివ్వని వ్యక్తి అంటే అది కిషోర్ మాత్రమే, స్పాంటేనియస్ గా పంచులు వేసేస్తాడు, తట్టుకోవడం కష్టం అందుకే అలా సరదగా అన్నాను దాన్ని ట్రోల్ల్స్ చేస్తున్నారు అంటూ చెప్పాడు.



























